అమిత్ షాకు విషెస్.. ప్రభాస్‌కు నో విషెస్? ఇదేం చర్చ బాసూ!
ప్రభాస్ అభిమానుల్లో కొందరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
By: Ramesh Palla | 24 Oct 2026 12:14 PM ISTప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులు ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌లు చేశారు, ఏఐ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ గురించి మాట్లాడుకున్నారు. ప్రభాస్‌కు ఎంతో మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా కొందరు స్టార్స్ చెప్పలేదు అనే విషయమై చర్చ మొదలైంది. ప్రభాస్ అభిమానులు ఈ విషయమై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పని స్టార్స్ పై కొందరు ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇక్కడ మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ప్రభాస్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు కేంద్ర మంత్రి అమిత్ షా పుట్టిన రోజు జరిగింది.
అమిత్ షాకి టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు...
అమిత్ షాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చాలా మంది సెలబ్రిటీలు ప్రభాస్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. బాలీవుడ్ హీరోలు, ఇతర భాషల స్టార్స్ అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, ప్రభాస్‌కి చెప్పలేదు అనే చర్చ ఇక్కడ రావడం లేదు. టాలీవుడ్‌కి చెందిన స్టార్స్ ఎవరైతే అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారో, వారి పేర్లను తీసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు ఎందుకు మా అన్నకు శుభాకాంక్షలు చెప్పలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ కు గతంలో శుభాకాంక్షలు చెప్పిన చాలా మంది స్టార్స్ ఈసారి ఆయన గురించి కనీసం పట్టించుకోక పోవడంకు కారణం ఏమై ఉంటుందా అని కొందరు విశ్లేషణలు మొదలు పెట్టారు. మొత్తానికి అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, ప్రభాస్‌కి చెప్పని తెలుగు స్టార్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు నెగటివ్ కామెంట్స్ చేయడం మొదలైంది.
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్...
ఇక్కడ అమిత్ షాకు ప్రభాస్‌కు పోలిక అని ఎవరూ అనడం లేదు. అమిత్ షా ఖచ్చితంగా గొప్ప వ్యక్తి, ఆయన కేంద్ర మంత్రి కనుక తెలుగు స్టార్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ను ఎవరూ తప్పు పట్టడం లేదు. అమిత్ షాకు శుభాకాంక్షలు చెప్పిన వారే ఎందుకు ప్రభాస్ కు శుభాకాంక్షలు చెప్పలేదు అనేది ఇక్కడ చర్చ. రాజమౌళి విషయానికి వస్తే ఆయన ఏ ఒక్కరికి ఈ మధ్య కాలంలో శుభాకాంక్షలు తెలియజేయలేదు. తన సినిమా వారణాసిలో నటించిన వారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నాడు. కనుక ఇక్కడ రాజమౌళి ఎందుకు ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు అనే ప్రశ్న రావడం లేదు. కానీ అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండలు ఎందుకు ప్రభాస్ ను పట్టించుకోలేదు అనే ప్రశ్నను అభిమానులు లేవనెత్తుతున్నారు.
చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ...
ప్రభాస్ అభిమానుల్లో కొందరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు మాత్రం ప్రభాస్‌కు వారు శుభాకాంక్షలు చెప్పకున్నా జరిగిన నష్టం ఏమీ లేదని, పాన్ ఇండియా రేంజ్‌లో ఉన్నకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే స్థాయిలో శుభాకాంక్షలను ఫ్యాన్స్ చెప్పారని అంటున్నారు. ఇండస్ట్రీలో హీరోలు అంతా కూడా చాలా సన్నిహితంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఎక్స్ లో లేదా మరో చోట పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పనంత మాత్రాన వారికి ప్రభాస్ అంటే ఇష్టం లేదని కాదు, కచ్చితంగా వారు పర్సనల్‌గా లేదంటే మరో రకంగా అయినా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఉంటారు. కనుక ఈ విషయంలోనూ రాద్దాంతం అవసరం లేదు అనేది సినీ విశ్లేషకుల మాట. ఈ వివాదం మరింత ముదిరితే ఫ్యాన్ వార్ వరకు వెళ్లే అవకాశం ఉంది. కనుక దీన్ని ఇంతటితో వదిలేస్తే ఉత్తమం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
