Begin typing your search above and press return to search.

రక్షాబంధన్ వేళ ప్రభాస్ ఫ్యాన్స్ ని హార్ట్ చేసిన కృష్ణంరాజు కూతురు.. పోస్ట్ వైరల్!

హిందూ సాంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఘనంగా ఆగస్ట్ 8న రక్షాబంధన్ జరుపుకున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   10 Aug 2025 10:34 PM IST
రక్షాబంధన్ వేళ ప్రభాస్ ఫ్యాన్స్ ని హార్ట్ చేసిన కృష్ణంరాజు కూతురు.. పోస్ట్ వైరల్!
X

హిందూ సాంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఘనంగా ఆగస్ట్ 8న రక్షాబంధన్ జరుపుకున్న విషయం తెలిసిందే. సామాన్యులను మొదలుకొని.. సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ తోబుట్టువులకు రక్షాబంధన్ కట్టి కానుకలు స్వీకరించారు. అంతేకాదు అందుకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక అంతా బాగానే ఉన్నా ఈ రక్షాబంధన్ వేళ దివంగత నటులు కృష్ణంరాజు కూతురు సాయి ప్రసీదా ఉప్పలపాటి చేసిన ఒక పోస్ట్ ప్రభాస్ అభిమానులను పూర్తిస్థాయిలో హర్ట్ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

దివంగత నటులు కృష్ణంరాజు కూతుళ్లలో సాయి ప్రసీదా ఉప్పలపాటి ఒక్కరే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అటు ఫ్రెండ్స్ తో చిట్ చాట్.. ఫ్యామిలీతో కాలక్షేపం.. హాలిడే ట్రిప్.. పండుగలు.. తన అన్నయ్య ప్రభాస్ తో ఫన్నీ టైం.. ఇలా ఏదైనా సరే ఆమెకు స్పెషల్ గా అనిపిస్తే ఇట్టే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రక్షాబంధన్ రోజు కూడా ప్రభాస్ కి రాఖీ కట్టిన ఫోటోని ఆమె ఎప్పుడెప్పుడు షేర్ చేస్తారా? ఆయన లుక్ ఎలా ఉండనుంది? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి కనబరిచారు. కానీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది ప్రసీద అంటూ అటు ప్రభాస్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రసీద ఇంస్టాగ్రామ్ లో ఎప్పటిలాగే పోస్ట్ పెట్టింది. తాను ఎవరికైతే రాఖీ కట్టిందో వాళ్లందరి ఫోటోలను కూడా ఆమె పంచుకుంది. కానీ ప్రభాస్ కి రాఖీ కట్టిన ఫోటోని మాత్రం ఆమె షేర్ చేయలేదు. దీంతో అభిమానులు ప్రభాస్ అన్న ఎక్కడ? ఆయన ఫోటో ఎందుకు పెట్టలేదు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రసీద ప్రభాస్ కు రాఖీ కట్టింది. అందుకు ఫస్ట్ ఫోటోనే నిదర్శనం అని చెప్పవచ్చు . అయితే ఇక్కడ కేవలం ప్రభాస్ రాఖీ కట్టించుకున్న చేతి ఫోటో మాత్రమే ఆమె అప్లోడ్ చేసింది. పైగా దానికి ప్రభాస్ ని కూడా ట్యాగ్ చేసింది. కానీ రాఖీ కడుతూ దిగిన ఫోటోలను మాత్రం ఆమె షేర్ చేయలేదు. దాంతో ఈసారి అభిమానులను హార్ట్ చేసింది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రక్షాబంధన్ వేళ అభిమానులను ప్రసీద నిరాశపరిచింది అనే కామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి.

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో 'ది రాజాసాబ్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. మరొకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమా కూడా చేస్తున్నారు .ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ ఆఖరిలో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీటితోపాటు కల్కి 2 , స్పిరిట్, సలార్ 2 వంటి చిత్రాలను లైన్ లో ఉంచారు ప్రభాస్. ఇవన్నీ కూడా ప్రభాస్ రేంజ్ ను పెంచడమే కాకుండా అభిమానులకు మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి.