ఎవర్రా మీరంతా..ఫ్యాన్స్..డైహార్డ్ ఫ్యాన్స్!
`సాహో` మూవీలోని ఓ యాక్షన్ సీన్‌లో ప్రభాస్ చెప్పే డైలాగ్ ..ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్`.. దాన్ని ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు నిజం చేస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 9 Jan 2026 12:47 PM IST`సాహో` మూవీలోని ఓ యాక్షన్ సీన్‌లో ప్రభాస్ చెప్పే డైలాగ్ ..ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్`.. దాన్ని ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ అభిమానులు నిజం చేస్తున్నారు. ఫ్యాన్స్‌లలో డార్లింగ్ ఫ్యాన్స్ వేరని చూపిస్తున్నారు. తన కోసం ఎలాంటి సెన్సేషన్‌ని అయినా క్రియేట్ చేయడానికి రెడీ అంటున్నారు. వీరు చేసే హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ `ది రాజాసాబ్`. మారుతి డైరెక్ట్ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది.
బాలీవుడ్ సీనియర్ నటి సంజయ్ దత్, బోమన్ ఇరానీ, వహీదా రెహమాన్ కీలక పాత్రల్లో నటించగా మాళవిక మోనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్‌లుగా నటించారు. ప్రభాస్ నటించిన తొలి హారర్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కావడంతో `ది రాజాసాబ్`పై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్‌లో మొదలైంది. ప్రీమియర్స్ నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ సందడి చేయడం మొదలు పెట్టారు.
సినిమాలో ప్రభాస్ మొసలి ఫైట్ ఉండటం, దానికి సంబంధించిన సీన్ బయటికి రావడంతో ట్రైలర్ రిలీజ్ దగ్గరి నుంచి మొసలి మీమ్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ కావడం మొదలైంది. శుక్రవారం `ది రాజాసాబ్` భారీ స్థాయిలో థియేటర్లలోకి రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి చేయడం మొదలు పెట్టారు. కొందరు అభిమానులు ఏకంగా మొసలి బొమ్మలను థియేటర్లలోకి తీసుకొచ్చి హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్‌లో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసే సన్నివేశం వచ్చే సమయంలో మొసలి బొమ్మలతో స్క్రీన్ వద్దకు వెళ్లి దాన్ని రీ క్రియేట్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట భారీ స్థాయిలో షేర్ అవుతూ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలను కొంత మంది కొట్టి పారేస్తున్నారు. ఇవన్నీ ఏఐ క్రియేటెడ్ వీడియోలని కామెంట్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం అవి మొసల బొమ్మలని తేల్చేస్తూ ఎవర్రా మీరంతా అని కామెంట్‌లు చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వీడియోలు చూసిన నెటిజన్‌లు కొందరు మాత్రం ఇది మొసల్ల పండగ అని `ది రాజాసాబ్` దెబ్బతో మొసళ్ల కూడా ట్రెండ్ అవుతోందని ఫన్నగా కామెంట్‌లు చేస్తున్నారు.
ఈ కామెంట్‌లు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా లైట్‌గా తీసుకుని ఫ్యాన్స్.. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ ..ఇలాగే ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. దీంతో మొసలికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి `ది రాజాసాబ్` ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి.
