Begin typing your search above and press return to search.

లార్జర్-ద్యాన్-లైఫ్ ఇమేజ్ వర్సెస్ ఎమోషనల్ కనెక్ట్!

`బాహుబలి` సిరీస్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసి టాలీవుడ్‌కు అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌ను అందించిన ఘనత రెబెల్ స్టార్ ప్రభాస్‌కే దక్కుతుంది.

By:  Srikanth Kontham   |   30 Jun 2026 12:00 AM IST
లార్జర్-ద్యాన్-లైఫ్ ఇమేజ్ వర్సెస్ ఎమోషనల్ కనెక్ట్!
X

`బాహుబలి` సిరీస్‌తో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసి టాలీవుడ్‌కు అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్‌ను అందించిన ఘనత రెబెల్ స్టార్ ప్రభాస్‌కే దక్కుతుంది. ఆ చిత్రం అందించిన ఇమేజ్‌తో ఆయన గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించారు. ప్రస్తుతం ప్ర‌భాస్ బాక్సాఫీస్ ప్రయాణాన్ని గమనిస్తే.. `సలార్`, `కల్కి` .. రాబోతున్న `స్పిరిట్` వంటి చిత్రాలన్నీ వందల కోట్ల భారీ బడ్జెట్లు, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ , లార్జర్-ద్యాన్-లైఫ్ -క్యారెక్ట రైజేషన్స్‌తోనే రూపొందుతున్నాయి. అయితే ఈ భారీతనం వెనుక చిన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ప్రభాస్ కెరీర్ ఆరంభంలో వచ్చిన `వర్షం`, `ఛత్రపతి`, `డార్లింగ్`, `మిస్టర్ పర్ఫెక్ట్` వంటి చిత్రాలు ఆయనకు మాస్, క్లాస్ ప్రేక్షకులలో సుస్థిరమైన స్థానాన్ని తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల్లోని సహజమైన వింటేజ్ డార్లింగ్ బాడీ లాంగ్వేజ్, సున్నితమైన హాస్యం, కుటుంబ భావోద్వేగాలు సగటు ప్రేక్షకుడికి ఎంతో బాగా కనెక్ట్ అయ్యేవి. కానీ ప్రస్తుత సినిమాల్లో భారీ యాక్షన్ సీక్వెన్సులు, గన్‌లు, డార్క్‌ థీమ్‌లకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ప్ర‌భాస్ లో సహజమైన ఎమోషనల్ పెర్ఫార్మర్‌ను ప్రేక్షకులు మిస్ అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీ కటౌట్లు, లార్జర్-ద్యాన్-లైఫ్ బిల్డప్‌లపైనే ఆధారపడటం వల్ల రాబోయే రోజుల్లో రూటెడ్ ఎమోషన్స్ కథలు ఆయనకు దూరమయ్యే ప్రమాదం ఉందనేది ఇండస్ట్రీ నిపుణుల విశ్లేషణ. కేవలం స్క్రీన్ సైజ్ ,వీఎఫ్ఎక్స్ హంగులతోనే లాంగ్ రన్‌లో స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే? ఎంతటి భారీ విజువల్స్ ఉన్నా ప్రేక్షకుడిని థియేటర్లలో కట్టిపడేసేది గుండెకు హత్తుకునే డ్రామా మాత్రమే. టెక్నాలజీ అనేది కథకు సహాయకారిగా ఉండాలి తప్ప అదే ప్రధాన కంటెంట్ కాకూడదు.

ఈ విషయాన్ని గమనించిన ప్రభాస్ లైనప్‌లో భారీ యాక్షన్ చిత్రాలతో పాటు విభిన్నమైన జోనర్లను కూడా చేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా ప్రేక్షకులతో మళ్లీ పాత రోజుల్లాంటి ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచుకోవడానికి కథల ఎంపికలో మార్పులు అవసరమని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల మధ్యలోనే రూటెడ్ - క్యారెక్టర్ డ్రివెన్ చిత్రాలను బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే గ్లోబల్ మార్కెట్‌లో స్టార్‌డమ్ సుదీర్ఘకాలం పాటు సేఫ్‌గా ఉంటుంది.

ప్రభాస్ సాధించిన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ టాలీవుడ్‌కు గర్వకారణం అయినప్పటికీ ఆయన సిగ్నేచర్ స్టైల్ అయిన `డార్లింగ్` మార్క్ మేనరిజమ్స్ , ఎమోషన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టడం సరికాదు. రాబోయే ప్రాజెక్టులలో భారీతనంతో పాటు, ఆడియన్స్‌ను కదిలించే బలమైన కథా బలమున్న సబ్జెక్టులకు కూడా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే రెబెల్ స్టార్ బాక్సాఫీస్ సామ్రాజ్యం మరింత పటిష్టంగా మునుపెన్నడూ లేని ఎత్తుకు ఎదుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.