ప్రభాస్ లో రెండు సైడ్స్ ఉన్నాయి
బాహుబలి తర్వాత ప్రభాస్ వివిధ జానర్లలో నటిస్తూ, బిజీగా ఉన్నారు. సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా అతని మార్కెట్ ను పెంచిందే.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 2:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి ముందు వరకు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే పరిమితమైన అతని క్రేజ్ బాహుబలి సినిమాల తర్వాత ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. తన క్రేజ్ కు తగ్గట్టే సినిమా సినిమాకీ మరింత కష్టపడుతూ ఆ క్రేజ్ తో పాటూ తన మార్కెట్ ను కూడా పెంచుకుంటూ వస్తున్నారు ప్రభాస్.
ఏడాదికి ఒక సినిమా రిలీజయ్యేలా ప్లాన్
బాహుబలి తర్వాత ప్రభాస్ వివిధ జానర్లలో నటిస్తూ, బిజీగా ఉన్నారు. సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా అతని మార్కెట్ ను పెంచిందే. మిగిలిన స్టార్లంతా ఒక్కో సినిమాకు రెండు మూడేళ్లు టైమ్ తీసుకుంటుంటే ప్రభాస్ మాత్రం ఏడాదికి ఒక సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుని దాని కోసం ఎంతో కష్టపడుతున్నారు.
కల్కితో భారీ హిట్ అందుకున్న ప్రభాస్
ప్రభాస్ నుంచి ఆఖరిగా వచ్చిన సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించగా, త్వరలోనే ఆ సినిమాకు సీక్వెల్ గా కల్కి2 కూడా చేయబోతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో అతనికి హీరో ప్రభాస్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
ప్రభాస్ ఇప్పటివరకు ఏదీ రిపీట్ చేయలేదు
ప్రభాస్ లో రెండు సైడ్స్ ఉంటాయని, అందులో ఒక సైడ్ చాలా ఫ్రెండ్లీగా, క్యాజువల్ గా, లైట్ హార్టెడ్ గా ఉంటారని, కానీ ఎప్పుడైతే స్క్రీన్ ముందుకు వస్తారో అప్పుడాయన అమేజింగ్ గా అనిపిస్తారని రియల్ లైఫ్ లో ప్రభాస్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటారని, ఇక రెండో సైడ్ గురించి చెప్పాలంటే ప్రభాస్ కు సినిమా అంటే చాలా ఇష్టమని, ఎలాంటి సినిమానైనా ఆయన ఎంజాయ్ చేస్తూ చేస్తారని, సినిమాల విషయంలో ప్రభాస్ చాలా స్మార్ట్ అని, ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఇప్పటివరకు ఏదీ రిపీట్ గా అనిపించదని, ప్రతీ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని, ఇప్పటికే ప్రభాస్ చాలా లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు చేశారని, ఇప్పటికీ ఆయన ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారని, చాలా చిన్న ఏజ్ లోనే చక్రం లాంటి సినిమా చేసిన హీరో ప్రభాస్ అని చెప్పారు నాగ్ అశ్విన్. అయితే ఇందులో ప్రభాస్ గురించి నాగి చెప్పిన ప్రతీ మాటా నూటికి నూరు పాళ్లు నిజమే అవడంతో ఈ వీడియో చూసి ఫ్యాన్స్ దాన్ని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
