తన దర్శకులకు ప్రభాస్ ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లు
ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరుగుతున్న `ది రాజా సాబ్` ప్రీరిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ ప్రభాస్ ని యాంకర్ సుమ తన దర్శకులకు ట్యాగ్ లు ఇవ్వాల్సిందిగా కోరారు.
By: Sivaji Kontham | 27 Dec 2025 11:12 PM ISTడార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లతో పలు రికార్డులు అందుకున్నాడు. అతడు నటించిన బాహుబలి ఫ్రాంఛైజీ మొదలు ప్రశాంత్ నీల్ తో సలార్ వరకూ సంచలన విజయాలు అతడి ఖాతాలో ఉన్నాయి. ఈ సినిమాలకు మధ్యలో చాలా మంది దర్శకులతో కలిసి పని చేసాడు. పూరి జగన్నాథ్ లాంటి సీనియర్ దర్శకుడితో `ఏక్ నిరంజన్` లాంటి మాస్ చిత్రంలో నటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రికార్డ్ బ్రేకింగ్ హిట్ చిత్రం `కల్కి 2898 ఏడి`లో నటించాడు. తదుపరి హను రాఘవపూడితో ఫౌజీ లో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో సాహో లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం దేశంలోని సంచలన దర్శకులలో ఒకడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` అనే భారీ కాప్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు.
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి తెరకెక్కించిన `ది రాజా సాబ్` సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పని చేసిన టాప్ -7 దర్శకులలో మారుతి కూడా చేరిపోయాడు. ప్రభాస్ ని మునుపెన్నడూ లేనంత కొత్తగా `ది రాజా సాబ్` లో చూపిస్తున్నాడు మారుతి. ఒక హారర్ చిత్రంలో కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాల్లో ప్రభాస్ కనిపించనున్నాడు. రాజా సాబ్ అనే ఏజ్డ్ వ్యక్తిగాను ప్రభాస్ లోని ఆశ్చర్యకరమైన షేడ్ ని చూపించబోతున్నాడు.
ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరుగుతున్న `ది రాజా సాబ్` ప్రీరిలీజ్ ఈవెంట్లో డార్లింగ్ ప్రభాస్ ని యాంకర్ సుమ తన దర్శకులకు ట్యాగ్ లు ఇవ్వాల్సిందిగా కోరారు. ఒకే ఒక్క మాటలో తన దర్శకుల గురించి చెప్పాల్సిందిగా సుమ నేరుగా ఈవెంట్లో ప్రభాస్ ని అడిగారు. దానికి ప్రభాస్ ఇలా స్పందించారు. తన దర్శకులు ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఇచ్చారు డార్లింగ్. నాగ్ అశ్విన్ - స్ట్రాంగ్ , ప్రశాంత్ నీల్ - బ్యూటిఫుల్ పర్సన్, రాజమౌళి - జీనియస్, మారుతి - క్యూట్, హను రాఘవపూడి- హార్డ్ వర్కింగ్, సుజీత్ - వెరీ స్మార్ట్, పూరి- జీనియస్ అని ప్రభాస్ అందరికీ ట్యాగ్ లు ఇచ్చారు. ఇక సందీప్ రెడ్డి వంగా గురించి చెబుతూ `కల్ట్- న్యూజనరేషన్ డైరెక్టర్` అని కితాబిచ్చేసాడు.
సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమాతో ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ తర్వాత వివాదాస్పద కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించే సత్తా అతడికి మాత్రమే ఉంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇవన్నీ కల్ట్ జానర్ స్వభావంతో కనిపిస్తూనే, కమర్షియల్ అంశాలతో మెప్పించాయి. అందుకే ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ `కల్డ్ డైరెక్టర్` అంటూ సందీప్ వంగాకు ట్యాగ్ ఇచ్చాడు. ప్రభాస్- సందీప్ వంగా కాంబినేషన్ లో కాప్ యాక్షన్ డ్రామా `స్పిరిట్` ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా సెట్స్ నుంచి నేరుగా `ది రాజా సాబ్` ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చానని ప్రభాస్ చెప్పాడు. బహుశా అతడి పిలకముడి `స్పిరిట్` చిత్రానికి సంబంధించినది అని అర్థం చేసుకోవచ్చు.
