Begin typing your search above and press return to search.

ప్రభాస్ అందరి డైట్ పాడు చేస్తాడు..కానీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకవైపు హీరోగానే కాకుండా మరొకవైపు మంచి మనసున్న రాజుగా పేరు దక్కించుకున్నారు.

By:  Madhu Reddy   |   1 Jan 2026 3:22 PM IST
ప్రభాస్ అందరి డైట్ పాడు చేస్తాడు..కానీ
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకవైపు హీరోగానే కాకుండా మరొకవైపు మంచి మనసున్న రాజుగా పేరు దక్కించుకున్నారు. అవసరమైన వారికి సహాయం అందిస్తూనే.. తనతో పని చేసేవారికి అతిధి మర్యాదలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ అందరి డైట్ పాడు చేస్తాడు అంటూ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు గతంలో కూడా చాలామంది హీరోయిన్స్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అతిధి మర్యాదలతో అందరినీ సత్కరించే ప్రభాస్ పై హీరోయిన్స్ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ రూట్ సపరేట్ అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయనతో కలిసి పనిచేసిన ఏ ఒక్కరైనా సరే ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఖచ్చితంగా ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించే మాట్లాడుతారు. ప్రభాస్ తనతో పని చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా తన ఇంటి నుండి భోజనాన్ని పంపించి వారిని ఆశ్చర్యపరచడమే కాకుండా వారంతా కడుపు పగిలిపోయేలా ఫుడ్డు పెట్టి చంపేస్తాడు అంటూ ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

వాస్తవానికి ప్రభాస్ ఇచ్చే విందు భోజనం అంటే కచ్చితంగా కనీసం 10 రకాల వంటలైనా ఉండాల్సిందే. అంతలా తన చుట్టూ ఉండే వారికి ఇలా భోజనం పెట్టి సంతోష పరుస్తూ ఉంటారు.అలా ఇప్పటికే ఈయనతో పని చేసిన ఎంతోమంది నటీనటులు ఈ విషయాలపై స్పందించారు. ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రభాస్ పై ఊహించని కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఇతరుల డైట్ పాడు చేయడంలో ముందుంటాడు అంటూ సరదాగా కామెంట్లు చేసింది .

ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్న నిధి అగర్వాల్ కి ప్రభాస్ ఆహారపు అలవాట్ల గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ను మాత్రమే తీసుకుంటాడు. ముఖ్యంగా ఆయన ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటిస్తాడు. రాజా సాబ్ సెట్ లో ఏ రోజు కూడా రైస్, ఇతర ఐటమ్స్ ఆయన తినడం నేను చూడనే లేదు. కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటాడు. ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా బరువు తగ్గాల్సిన అవసరం ఉంది. అందుకే స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు.

ముఖ్యంగా లిమిట్ లెస్ ఫుడ్ పెట్టే ప్రభాస్ అందరి డైట్ పాడుచేసి తాను మాత్రం స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తాడు అంటూ నిధి కామెంట్లు చేసింది .మొత్తానికి అయితే ప్రభాస్ డైట్ ఏ రేంజ్ లో ఫాలో అవుతారో చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నిధి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రభాస్, నిధి అగర్వాల్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా జనవరి 9న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది . మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.