Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో నైట్ రైడ్స్..DSP రివీల్ చేసిన ఫన్ మెమరీస్!

కెరీర్ మొదట్లో ‘వర్షం’ సినిమా టైంలో తామంతా రాత్రంతా హైదరాబాద్ రోడ్లపై ఎలా తిరిగేవాళ్లమో చెప్పారు.

By:  Madhu Reddy   |   27 May 2026 5:03 PM IST
ప్రభాస్ తో నైట్ రైడ్స్..DSP రివీల్ చేసిన ఫన్ మెమరీస్!
X

రెబల్ స్టార్ ప్రభాస్ బయట ఎంత సరదాగా ఉంటారో మనందరికీ తెలిసిందే. తాజాగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రభాస్‌తో తనకు ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కెరీర్ మొదట్లో ‘వర్షం’ సినిమా టైంలో తామంతా రాత్రంతా హైదరాబాద్ రోడ్లపై ఎలా తిరిగేవాళ్లమో చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ క్రేజీ ముచ్చట్ల, విశేషాలు మీకోసం..

అర్ధరాత్రి కంపోజిషన్లు.. అంతా డాన్సులే:

ప్రభాస్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘వర్షం’ (2004) సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో జరిగిన ఫన్నీ విషయాలను డీఎస్‌పీ రివీల్ చేశారు. సాయంత్రం కాగానే నిర్మాత ఎం.ఎస్. రాజు గారు ఆఫీస్ నుండి వెళ్లిపోయేవారట. ఇక ఆయన వెళ్లడమే ఆలస్యం.. ప్రభాస్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రభాస్ శ్రీను, ప్రమోద్ అంతా డీఎస్‌పీ రూమ్‌కి వచ్చేసేవారట. ఇక అక్కడ రాత్రంతా పాటల కంపోజిషన్స్ జరుగుతుంటే, అందరూ రూమ్‌లోనే ఫుల్‌గా డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసేవారట.

నా కారులో హైదరాబాద్ రోడ్లపై..:

పాటల పని పూర్తయ్యాక అసలైన హంగామా మొదలయ్యేదని డీఎస్‌పీ చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభాస్ అండ్ గ్యాంగ్ అంతా కలిసి డీఎస్‌పీ కారు ఎక్కేసేవారట. ఇక అలా రాత్రంతా హైదరాబాద్ రోడ్ల మీద కార్లలో సరదాగా షికార్లు కొడుతూ తెల్లవార్లూ ఎంజాయ్ చేసేవాళ్లమని, ఆ రోజులు అసలు మర్చిపోలేనని దేవి శ్రీ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు.

మ్యూజికల్ హిట్ 'వర్షం':

నిజానికి ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా, మాస్ హీరోగా నిలబెట్టింది ‘వర్షం’ సినిమాయే. ఈ చిత్రానికి డీఎస్‌పీ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి.ఇక ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ ఆల్బమ్ తనను ప్రభాస్ కుటుంబంలో ఒక సభ్యుడిగా మార్చేసిందని, తన లైఫ్‌లోనే ఇది మోస్ట్ ఫేవరెట్ మ్యూజికల్ జర్నీ అని డీఎస్‌పీ కొనియాడారు.

హీరోగా మారుతున్న రాక్‌స్టార్:

ఇదిలా ఉంటే, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీని ఏలుతున్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఆయన త్వరలోనే ‘యల్లమ్మ’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఎప్పుడూ తన మ్యూజిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్‌లతో స్టేజీలపై ఎనర్జీతో ఊపేసే డీఎస్‌పీ, ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎలా అలరిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్టార్‌డమ్ వచ్చినా రాకపోయినా డార్లింగ్ ప్రభాస్ మనస్తత్వం అస్సలు మారలేదని డీఎస్‌పీ మాటలను బట్టి మరోసారి అర్థమవుతోంది.ఇక నాటి ‘వర్షం’ జ్ఞాపకాల నుండి నేటి ‘యల్లమ్మ’ సినిమా వరకు దేవి శ్రీ ప్రసాద్ వేస్తున్న ప్రతి అడుగు సక్సెస్‌ఫుల్‌గా సాగాలని, ఆయన హీరోగా కూడా సూపర్ హిట్ కొట్టాలని మనసారా కోరుకుందాం.