ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన ‘డార్లింగ్’, ‘బుజ్జిగాడు’ చిత్రాలకు సీక్వెల్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌తో మరోసారి సినిమా చేయాలని ఆశిస్తున్నారు. ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ప్రాజెక్టుల తర్వాత ప్రభాస్ క్లాసిక్ ఎంటర్టైనర్ వైపు అడుగులు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
By: Gopi Velupala | 9 Nov 2026 9:46 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోల కెరీర్ గ్రాఫ్ గత కొద్ది సంవత్సరాల్లో గణనీయమైన మార్పులకు లోనైంది. ఒకప్పుడు కేవలం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైన మన చిత్రాలు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టైర్ వన్ హీరోలందరూ వైవిధ్యమైన భారీ బడ్జెట్ యాక్షన్ కథాంశాలను ఎంచుకుంటున్నారు. అయితే కెరీర్ ప్రారంభ దశలో స్టార్ ఇమేజ్ పరిమితులు లేని రోజుల్లో హీరోలు చేసిన కొన్ని క్లాసిక్ సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ వస్తే బాగుంటుందనే చర్చ సినీ వర్గాల్లో, ముఖ్యంగా అభిమానుల్లో జోరుగా సాగుతోంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలపైనే అందరి దృష్టిలో నెలకొని ఉంది.
డార్లింగ్ సీక్వెల్ పై కల్ట్ ఫ్యాన్స్ ఆశలు
దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన 'డార్లింగ్' చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ప్రత్యేకంగా ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రభాస్ ప్రస్తుత ఉన్న ఇమేజ్ కి సరిపోయేలా ఒరిజినల్ కథలోని సోల్ మిస్ అవ్వకుండా బలమైన స్క్రిప్ట్ కుదిరితే 'డార్లింగ్ 2' రూపుదిద్దుకునే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల అంచనా...
బుజ్జిగాడు
ప్రభాస్ లోని కొత్త నటుడిని బయటకు తీసిన మూవీ బుజ్జిగాడు. తన బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ మేకోవర్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో డైలాగ్స్ ఇప్పటికీ పాపులరే... ప్రభాస్ పూరి జగన్నాథ్ కలిసిన ప్రతిసారి ఈ కాంబినేషన్ కు సంబంధించిన చర్చలు వస్తుంటాయని సరైన కథ దొరికితే ఈ జోడి మరోసారి రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు...
మాస్ యాక్షన్ మధ్య ఎంటర్టైనర్ల లోటు
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ అత్యుత్తమ విజువల్స్ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందుతున్నాయి.వీటి మధ్య జోవియల్ గా కనిపించే ప్రభాస్ ను తెర పై మిస్ అవుతున్నామనే భావన ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో 'ది రాజాసాబ్' సినిమాతో ఆ లోటు ను భర్తీ చేయాలని భావించినప్పటికి పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ ను కోరుకునే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతిని మిగిల్చింది. ఒకప్పుడు పంచులతో కూడిన పాత్రలను చేసిన ప్రభాస్ మళ్ళి వాటిని రిపీట్ చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు...
ప్రస్తుత ప్రాజెక్టుల లైనప్
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్ మూవీస్ తో బిజీగా ఉన్న ఆయన ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2', నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'కల్కి 2' చిత్రాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులు పూర్తి కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అభిమానుల ఆకాంక్ష మేరకు రాబోయే రోజుల్లో ప్రభాస్ మళ్ళీ క్లాసిక్ కామెడీ ఎంటర్ టైనర్ వైపు అడుగులు వేస్తారా? ఆ సినిమాలకు సీక్వెల్స్ పట్టాలెక్కుతాయా లేదా అనేది వేచి చూడాలి...
