Begin typing your search above and press return to search.

ప్రభాస్, చిరు.. కోర్టు తీర్పుతో బాక్సాఫీస్ కి లైన్ క్లియర్

అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో సింగిల్ బెంచ్ కొన్ని సినిమాల టికెట్ రేట్ల పెంపు మీద స్టే ఇచ్చింది.

By:  M Prashanth   |   7 Jan 2026 1:50 PM IST
ప్రభాస్, చిరు.. కోర్టు తీర్పుతో బాక్సాఫీస్ కి లైన్ క్లియర్
X

సంక్రాంతి సినిమాల చుట్టూ తిరుగుతున్న గందరగోళానికి ఒక ఎండ్ కార్డ్ పడింది. ముఖ్యంగా టికెట్ రేట్ల విషయంలో టెన్షన్ పడుతున్న ప్రభాస్ ది రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో భారీ ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు గురించి నిర్మాతలు పెట్టుకున్న రిక్వెస్ట్‌ల మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని కోర్టు ఆదేశించింది. దీంతో ఇన్ని రోజులు ఆగిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్ కి ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.

అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో సింగిల్ బెంచ్ కొన్ని సినిమాల టికెట్ రేట్ల పెంపు మీద స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆ ఉత్తర్వులను కేవలం పుష్ప 2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితం చేస్తూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. అంటే సంక్రాంతికి రాబోతున్న 'ది రాజా సాబ్', 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాలకు ఈ అడ్డంకులు వర్తించవు. ఈ తీర్పుతో మెగా ఫ్యాన్స్ తో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ప్రభాస్ 'ది రాజా సాబ్' జనవరి 9న థియేటర్ల లోకి రాబోతోంది. రిలీజ్ కి టైమ్ దగ్గరపడుతున్నా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల పర్మిషన్ లేక బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రమోషన్స్ లో జోష్ పెరగనుంది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ హారర్ ఫాంటసీ మూవీకి టికెట్ రేట్ల పెంపు అనేది నిర్మాతలకు చాలా ప్లస్ అవుతుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'MSG' జనవరి 12న సందడి చేయనుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు కూడా రేట్ల పెంపు పర్మిషన్ దక్కడం పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. పండగ టైమ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల కి క్యూ కడతారు కాబట్టి, ఈ టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే కలెక్షన్లు సినిమా రేంజ్ ని మారుస్తాయి. నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.

ఒకవేళ కోర్టు ఈ పర్మిషన్ ఇవ్వకపోతే సంక్రాంతి బాక్సాఫీస్ లెక్కలు తారుమారయ్యేవి. పెద్ద సినిమాల బడ్జెట్ రికవరీ అవ్వాలంటే టికెట్ ధరల పెంపు చాలా అవసరం. ఇప్పుడు హోంశాఖ నిర్ణయం తీసుకోబోతోంది కాబట్టి, ఒకటి రెండు రోజుల్లో అఫీషియల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు థియేటర్ల దగ్గర అసలైన పండగ మొదలవుతుంది. సంక్రాంతి ఫైట్ లో ఉన్న పెద్ద సినిమాలకి ఇదొక బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ తో ఏ సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.