Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ కోట్లాది అభిమానుల మూమెంట్ ఇది!

తాజాగా చైన్ ప్ర‌భాస్ వ‌ర‌కూ చేర‌డంతో? ఆయ‌నా త‌న ఛాంపియ‌న్ మూమెంట్ గురించి ఓపెన్ అవుతాడా? లేదా? అన్న‌ది సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.

By:  Srikanth Kontham   |   23 Dec 2025 11:34 PM IST
ప్ర‌భాస్ కోట్లాది అభిమానుల మూమెంట్ ఇది!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కామ్ గోయింగ్ న‌టుడు. వీలైనంత వ‌ర‌కూ ప్ర‌యివేట్ గా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న సినిమాలు రిలీజ్ స‌మ‌యంలో మిన‌హా మీడియాలో పెద్ద‌గా హైలైట్ అవ్వ‌డు. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండ‌డు. కానీ ఏదైనా అంశం గురించి మాట్లాడాల్సి వ‌స్తే? ఎంతో ఓపెన్ గా మాట్లాడుతాడు. ఎలాంటి దాప‌రికాలు లేకుండా స‌ర‌దాగా స్పందిస్తాడు. అప్పుడ‌ప్పుడు టాక్ షోల వేదిక‌గా ప్ర‌భాస్ స్పందించిన తీరు చూస్తే? అత‌డు ఇంత‌ స‌ర‌దాగా ఉంటాడా? అని తెలియని వారంతా తెలుసుకుంటారు. ఇక ప్ర‌భాస్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు వ‌స్తే ఆయ‌న గురించి టాపిక్ వ‌చ్చిందంటే? నాన్ వెజ్ ప్రియుడు అన్న‌దే హైలైట్ అవుతుంది.

ఏ మీడియాలోనైనా ఎక్కువ‌గా తిండి అంశ‌మే హైలైట్ అవుతుంది. ఇత‌ర ఏ విష‌యాలు పెద్ద‌గా తెర‌పైకి రావు. ప్ర‌త్యేకించి ప్ర‌భాస్ కి సంబంధించి స్పోర్స్ట్ ప‌రంగా ఎక్క‌డా వెలుగులో రాలేదు. ఇంత వ‌ర‌కూ ఈ క్వ‌శ్చ‌న్ కూడా ఆయ‌న ముందు రెయిజ్ అవ్వ‌లేదు. తాజాగా శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తోన్న `ఛాంపియ‌న్` రిలీజ్ లో భాగంగా వినూత్న ప్ర‌చారానికి తెర తీసింది టీమ్. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం రొటీన్ ఇంటర్వ్యూలు , పోస్టర్లకు భిన్నంగా వినూత్న ప్రచార పంథాను ఎంచుకున్నారు.

సెల‌బ్రిటీలు తమ జీవితంలోని `ఛాంపియన్ మూమెంట్` తెలియ‌జేస్తూ మరొక స్టార్‌ను ట్యాగ్ చేయాలని కోరుతూ సోషల్ మీడియా చైన్ ప్రచారాన్ని ప్రారంభిం చారు. ఎక్స్ వేదిక‌గా ఒక సెలబ్రిటీ నుండి మరొ కరికిఈ క్యాంపెయిన్ ఊపందు కుంది. ఇప్పుడీ చైన్ ప్ర‌భాస్ వ‌ర‌కూ చేర‌డంతో ఛాంపియ‌న్ ప్ర‌చారం పీక్స్ కు చేరిన‌ట్లు అయింది. ప్ర‌భాస్ కు భారీ ఫాలోయింగ్ ఉన్నా, కోట్లాది మంది అభిమా నించే న‌టుడైనా? ఇప్పటి వరకూ ఎక్స్‌ ప్లాట్ ఫామ్‌కు దూరంగానే ఉన్నాడు. తాజాగా చైన్ ప్ర‌భాస్ వ‌ర‌కూ చేర‌డంతో? ఆయ‌నా త‌న ఛాంపియ‌న్ మూమెంట్ గురించి ఓపెన్ అవుతాడా? లేదా? అన్న‌ది సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ స‌న్నివేశం దేశ వ్యాప్తంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ అంద‌రిలో ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భాస్ గ‌నుక ఛాంపియ‌న్ మూమెంట్ గురించి ఓపెన్ అయితే `ఛాంపియ‌న్` సినిమాకు కోట్లాది రూపాయ‌ల ప‌బ్లిసిటీ ద‌క్కిన‌ట్లే. అలాగే ఏ క్రీడ‌లో డార్లింగ్ స్పెష‌లిస్ట్ అన్న‌ది కూడా ప్ర‌పంచానికి తెలియ‌నుంది. ప్ర‌భాస్ కం స్పోర్స్ట్ ప్రియులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఆస‌క్తికి తెర‌ప‌డిన‌ట్లు అవుతుంది.