Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ సైలెంట్ గానే ముగించేశాడా?

టాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ, హను మాన్ స‌క్సెస్‌తో తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)పై భారీ అంచనాలు నెలకొల్పారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 March 2026 12:23 PM IST
ప్ర‌భాస్ సైలెంట్ గానే ముగించేశాడా?
X

టాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ, హను మాన్ స‌క్సెస్‌తో తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)పై భారీ అంచనాలు నెలకొల్పారు. ఇప్పుడు ఆయన రూపొందిస్తున్న మహాకాళి ప్రాజెక్ట్ చుట్టూ ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ క్యామియోపై వస్తున్న వార్తలు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి. గత కొన్నాళ్లుగా ప్రభాస్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా టాక్ ప్రకారం, ఆయన ఇప్పటికే తన భాగం షూటింగ్‌ను పూర్తి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడం వల్ల ఇది నిజమా? లేక కేవలం హైప్ క్రియేట్ చేయడానికి వచ్చిన రూమరా? అన్న సందేహం కొనసాగుతోంది. ఇదే అంశం ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చగా మారింది.

ఇదిలా ఉండగా, ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ విస్తరణపై కూడా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. హను మాన్ తో ప్రారంభమైన ఈ యూనివర్స్, మహాకాళి తో మరింత విస్తరించబోతోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ప్రభాస్ పాత్ర నిజమైతే, అది ఫ్యూచ‌ర్ సినిమాలకు కూడా లింక్ అయ్యే కీలక క్యారెక్టర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఇప్పటికే పలు థియరీలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

లేడీ సూప‌ర్ హీరో క‌థ‌గా మ‌హాకాళి

మరోవైపు, టాలీవుడ్‌లో మహిళా సూపర్ హీరో కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి సమయంలో మహాకాళి పూర్తిగా ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో మూవీగా రావడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇందులో భూమి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కథలో మహిళా శక్తిని కొత్త కోణంలో చూపించబోతున్నారనే అంచనాలు ఉన్నాయి. ప్రొడక్షన్ పరంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ప‌శ్చిమ బెంగాల్ నేప‌థ్యంలో..

మ‌హాకాళి సాధారణ ప్రాజెక్ట్ కాదని, గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందుతున్నదనే టాక్ ఇండ‌స్ట్రీలో గ‌ట్టిగా వినిపిస్తోంది. సినిమా బ్యాక్ డ్రాప్ ను కూడా పశ్చిమ బెంగాల్ నేప‌థ్యంలో ఎంచుకోవ‌డం కథకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ ప్రాంతంలోని కల్చర్, మిస్టిక్ ఎలిమెంట్స్, దేవతారాధన నేపథ్యం.. అన్నీ కలిపి మహాకాళి కథను మరింత బలంగా నిలబెట్టేలా ఉంటాయని భావిస్తున్నారు.

మహాకాళిపై భారీ బిజినెస్ అంచ‌నాలు

ఇక మార్కెట్ పరంగా చూస్తే, హను మాన్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్స్‌పై ట్రేడ్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ త‌రుణంలో మహాకాళిపై కూడా భారీ బిజినెస్ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ క్యామియో వార్తలు నిజమైతే, ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో మరింత క్రేజ్ పెరగడం ఖాయం. మొత్తంగా చూస్తే, మహాకాళి సినిమా కేవలం మరో ప్రాజెక్ట్ గా కాకుండా బజ్, యూనివర్స్ బిల్డింగ్, ఫీమేల్ సూపర్ హీరో కాన్సెప్ట్, గ్రాండ్ మేకింగ్ అన్నీ కలిపిన మల్టీ లేయర్డ్ ప్రాజెక్ట్‌గా మారుతోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. ప్రభాస్ నిజంగా ఈ యూనివర్స్‌లోకి ఎంటర్ అవుతున్నారా లేదా? అని.