ఏదో ఫ్యాన్స్ ను శాటిస్‌ఫై చేయడానికి ప్రభాస్ అలా చెప్పలేదు.. చాలా స్ట్రాంగ్ గా!
బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత ప్రభాస్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 2:00 PM ISTబాహుబలి ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత ప్రభాస్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను బాహుబలి సినిమాలు పాన్ ఇండియా స్టార్ ను చేశాయి. బాహుబలితో డార్లింగ్ కు అంతటి స్టార్‌డమ్ దక్కింది. బాహుబలి సినిమా కోసం ఎన్నో ఏళ్లను ఖర్చు పెట్టిన ప్రభాస్, ఆ తర్వాత సినిమాల వేగాన్ని పెంచి కనీసం ఏడాదికి ఓ సినిమా చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే.
భారీ లైనప్ తో ప్రభాస్
ఏదో ఫ్యాన్స్ ను శాటిస్‌ఫై చేయడానికి ప్రభాస్ అలా చెప్పి ఉంటారులే అని అందరూ అనుకున్నారు కానీ ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగానే పలు సినిమాలను లైన్ లో పెట్టి కుదిరితే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ లైనప్ పలు భారీ సినిమాలతో చాలా స్ట్రాంగ్ గా ఉంది.
పలు ఫ్రాంచైజ్ సినిమాలతో బిజీ బిజీ
పలు ఫ్రాంచైజ్ సినిమాలతో డార్లింగ్ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రిలీజ్ కు రెడీ అవుతున్న రాజా సాబ్ రెండు భాగాలుగా రిలీజ్ కానుండగా, హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజి రెండు సినిమాలుగా రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న స్పిరిట్ కూడా రెండు భాగాలుగానే రానుంది. ఇవి కాకుండా కల్కి2898ఏడి కు సీక్వెల్ గా కల్కి2 చేయాల్సి ఉంది.
ఆల్రెడీ కల్కి2 స్క్రిప్ట్ వర్క్ పూర్తైంది కానీ ఈ ప్రాజెక్టు నుంచి దీపికా సడెన్ గా తప్పుకోవడంతో పాటూ ప్రభాస్ కూడా వేరే సినిమాలకు కమిట్ అవడంతో కల్కి2 లేటవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకు కొనసాగింపుగా సలార్2 వస్తుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్న నీల్, తర్వాత కెజిఎఫ్3 చేసి ఆ తర్వాత సలార్2 చేసే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో ఓ మూవీ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ పూర్తి చేయడానికే డార్లింగ్ కు చాలా టైమ్ పట్టనుండగా, కొత్త సినిమాలను లైన్ లో పెట్టడానికి మరికొన్ని కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది.
