బాలీవుడ్ స్టార్స్ ను సైతం వెనక్కి నెట్టే.. ఇండియన్ సినిమా రికార్డ్స్ తిరగరాసిన ఏకైక టాలీవుడ్ హీరో?
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ధీరుడు ప్రభాస్. బాహుబలితో మొదలైన ఆయన రికార్డుల వేట నేటికీ ఆగడం లేదు.
By: Madhu Reddy | 18 March 2026 8:08 PM ISTతెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ధీరుడు ప్రభాస్. బాహుబలితో మొదలైన ఆయన రికార్డుల వేట నేటికీ ఆగడం లేదు. కేవలం టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్ బడా హీరోలను సైతం వెనక్కి నెట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు, 1800 కోట్ల క్లబ్‌లను పరిచయం చేసిన ఘనత ఆయనది. ఒక్క మాటలో చెప్పాలంటే, నేడు మనం చూస్తున్న 'పాన్ ఇండియా' అనే పదానికి నిలువెత్తు రూపం ప్రభాస్. ఆయన సృష్టించిన అరుదైన రికార్డుల ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం.
1000 కోట్ల క్లబ్ కి ఆద్యుడు.. బాక్సాఫీస్ బాద్షా:
భారతీయ సినీ చరిత్రలో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొదటి హీరోగా ప్రభాస్ రికార్డ్ సృష్టించారు. 'బాహుబలి 2' సినిమాతో ఆయన ఏకంగా 1800 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించి గ్లోబల్ లెవల్‌లో టాలీవుడ్ జెండా పాతారు. తెలుగు హీరోల్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే 1000 కోట్ల నెట్ కలెక్షన్లు అందుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచారు. ఇక సౌత్ నుంచి వెళ్లి హిందీ మార్కెట్‌లో 500 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన నాన్-బాలీవుడ్ యాక్టర్ కూడా ఆయనే. ఈ రికార్డులు చూస్తుంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది.
ఓపెనింగ్స్ లో ప్రభాస్ కు సాటిలేరు:
సినిమా ఏదైనా సరే, మొదటి రోజే ప్రభాస్ సృష్టించే హంగామా మామూలుగా ఉండదు. ఏకంగా 6 సినిమాలతో 100 కోట్ల ప్లస్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ సాధించిన ఏకైక స్టార్ ప్రభాస్. ఒక్క మొదటి రోజే 1 కోటి మందికి పైగా జనం థియేటర్లకు రావడం (బాహుబలి 2) అనేది ఒక అద్భుతం. అలాగే ఒకే రోజున 50 లక్షల మంది కంటే ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించిన ఘనత కూడా ఆయన సొంతమే.ఇక ఏకంగా బుక్ మై షోలో 1 మిలియన్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న మల్టిపుల్ సినిమాలు కలిగి ఉండటం ప్రభాస్ క్రేజ్‌కు నిదర్శనం.
డిజిటల్ దునియాలోనూ డార్లింగ్ హవా:
కేవలం థియేటర్లలోనే కాదు, యూట్యూబ్ రికార్డుల్లోనూ ప్రభాస్ కింగ్. 'బాహుబలి 2', సాహో వంటి సినిమాలతో 100 మిలియన్ హిందీ ట్రైలర్ వ్యూస్ సాధించిన మొదటి నాన్-బాలీవుడ్ హీరో ప్రభాస్. 'ఆదిపురుష్' టీజర్ కూడా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించి డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేసింది. తమిళనాడులో 100 కోట్ల నెట్ వసూలు చేసిన మొదటి నాన్-తమిళ్ హీరోగా కూడా రికార్డ్ సృష్టించారు. ఇక అంటే ఆయన కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించగలరని నిరూపించారు.
ఆధునిక భారతీయ సినిమా సూపర్ స్టార్:
నేటి తరం పాన్ ఇండియా సినిమాలకు ప్రభాస్ ఒక గైడ్ లాంటి వారు. ఏకంగా 10 కోట్ల ఓవర్సీస్ ఫుట్‌ఫాల్స్ సాధించిన ఘనత ఆయన వల్లే సాధ్యమైంది. బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రభాస్ రికార్డులను చూసి ఆశ్చర్యపోయే స్థాయికి ఆయన ఎదిగారు. రికార్డులు ఎవరైనా సృష్టించవచ్చు కానీ, వాటిని మళ్ళి తిరగరాయడం మాత్రం డార్లింగ్ ప్రభాస్‌కే చెల్లింది. భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులతో ప్రభాస్ మరిన్ని అంతర్జాతీయ రికార్డులను కొల్లగొట్టడం ఖాయం అన్నటున్నారు అభిమానులు.
