ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ బర్త్‌డే సర్ప్రైజ్.. ఇమాన్వి పోస్ట్ వైరల్!
టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల బడ్జెట్లు, బాక్సాఫీస్ రికార్డులే కాదు.. ఆయన ఆతిథ్యం కూడా అంతే భారీగా ఉంటుంది.
By: Madhu Reddy | 14 Oct 2026 6:44 PM ISTటాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల బడ్జెట్లు, బాక్సాఫీస్ రికార్డులే కాదు.. ఆయన ఆతిథ్యం కూడా అంతే భారీగా ఉంటుంది. తన సినిమాల్లో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇంటి నుంచి వెరైటీ వంటకాలతో విందు పంపడం డార్లింగ్‌కు ఉన్న అలవాటు. తాజాగా ‘ఫౌజీ’ సినిమా కథానాయిక ఇమాన్వీ ఇస్మాయిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పంపిన భారీ ఫుడ్ సర్ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విశేషాలు చూద్దాం..
డార్లింగ్ పంపిన బర్త్‌డే విందు:
‘ఫౌజీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న ఇమాన్వీ ఇస్మాయిల్ అక్టోబర్ 13న తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో చిత్రయూనిట్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. అయితే, హీరో ప్రభాస్ ఆమెకు ఇచ్చిన పర్సనల్ సర్ప్రైజ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. రకరకాల నోరూరించే నాన్-వెజ్ వంటకాలు, బిర్యానీ, స్వీట్స్ ఇతర ప్రత్యేక పదార్థాలతో కూడిన విందును ఆయన ఆమె కోసం స్వయంగా పంపించారు.
"మనసు, కడుపు నిండిపోయింది!":
ప్రభాస్ పంపిన నోరూరించే భోజనాన్ని టేబుల్‌పై అమర్చి తీసిన ఫొటోలు, వీడియోలను ఇమాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "నా మనసు, కడుపు ఎప్పటికీ పూర్తిగా నిండిపోయాయి. థ్యాంక్యూ ప్రభాస్ గారు" అంటూ ఆమె పెట్టిన పోస్ట్ నిమిషాల్లో వైరల్ అయింది. ఇక సెట్స్‌లో ఎంత సరదాగా ఉంటారో, స్పెషల్ డేస్‌లో ఇలాంటి ట్రీట్స్ ఇవ్వడంలో ప్రభాస్ స్టైలే వేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
'ఫౌజీ'పై భారీ అంచనాలు:
ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 3న విడుదలవుతుందని ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. 2027 మార్చి 18న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
గ్లింప్స్‌తో క్లారిటీ :
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్న గ్లింప్స్‌లో రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని టాక్. పాన్ ఇండియా సినిమాకు మార్చి 18 సరైన విడుదల తేదీ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’లో ప్రభాస్ సరసన నటించే బిగ్ ఛాన్స్ కొట్టేసింది ఇమాన్వీ. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.
ఇక మొత్తానికి చూస్తే, వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్ తన పెద్ద మనసుతో, అద్భుతమైన ఆతిథ్యంతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. ప్రభాస్ పంపిన బర్త్‌డే ఫుడ్‌తో ఇమాన్వి ఎంతో సంతోషంగా ఉంది. మరోవైపు, అక్టోబర్ 23న రానున్న ‘ఫౌజీ’ స్పెషల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
