Begin typing your search above and press return to search.

రెబల్ ర్యాంపేజ్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న గీత ఆర్ట్స్ వీడియో..!

ఇక ఈ క్రమంలోనే ప్రత్యేకంగా గీతా ఆర్ట్స్ నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు.

By:  Ramesh Boddu   |   23 Oct 2025 12:44 PM IST
రెబల్ ర్యాంపేజ్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న గీత ఆర్ట్స్ వీడియో..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే ఈరోజు.. ఈశ్వర్ సినిమా నుంచి రాబోతున్న కల్కి 2898 AD వరకు ప్రభాస్ సినిమాల గ్రాఫ్ ఎలా ఉందో తెలిసిందే. ముఖ్యంగా రెబల్ స్టార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందిస్తూ వస్తున్నాడు రెబల్ స్టార్. వర్షం సినిమా నుంచి తన సక్సెస్ క్రేజ్ పెంచుకుంటూ వచ్చిన ప్రభాస్ మధ్యలో కొన్ని మిస్ ఫైర్ అవుతున్నా సరే ఫ్యాన్స్ కి కావాల్సినంత మాస్ స్టఫ్ అందిస్తూ స్టార్ మేనియా కొనసాగించాడు.

రాజమౌళి ఛత్రపతితో ప్రభాస్..

రాజమౌళితో తీసిన ఛత్రపతి ప్రభాస్ కి మాస్ ఇమేజ్ ని డబుల్ చేయగా ఇక బాహుబలి తర్వాత అతన్ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. స్టార్ హీరో అయిన ప్రభాస్ నేషనల్ లెవెల్ లో బిజీయెస్ట్ యాక్టర్ గా కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఐతే ఎంత క్రేజ్ ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం అందరికీ డార్లింగ్ లానే అనిపిస్తాడు. ఎందుకంటే చాలా మృదు స్వభావి.. మంచితనమ.. జీతో పర్సెంట్ నెగిటివిటీ ఉన్న హీరో ప్రభాస్ అని అంటుంటారు.

అందుకే ప్రభాస్ బర్త్ డేకి ఆయనతో పనిచేసిన దర్శక నిర్మాతలు అందరు స్పెషల్ విషెస్ అందించారు. ఇక ఈ క్రమంలోనే ప్రత్యేకంగా గీతా ఆర్ట్స్ నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రభాస్ మా ర్యాంపేజ్ ఎలా ఉంది అనేది చూపిస్తూ ప్రభాస్ అన్ని సినిమాల్లో అతని ఎలివేషన్స్, డైలాగ్ డెలివరీ, అతని గురించి ప్రముఖులు మాట్లాడిన క్లిప్స్ అన్నీ కలిపి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఈ వీడియో ఉంది.

రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు.

గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కిపోతున్నారు. ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇంకా ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అంటున్నారు. రెబల్ స్టార్ మీద గీతా ఆర్ట్స్ చూపించిన ఈ ప్రేమను ఫ్యాన్స్ అంతా ఫీస్ట్ చేసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ లో ఇప్పటివరకు ప్రభాస్ ఒక సినిమా కూడా చేయలేదు. ఐతే ఈ రేంజ్ ఎలివేషన్స్ చూస్తుంటే గీతా ఆర్ట్స్ లో ప్రభాస్ సినిమా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు.

ఏది ఏమైనా గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. రెబల్ ఫ్యాన్స్ కాదు సగటు సినీ ప్రేక్షకుడు కూడా సర్ ప్రైజ్ అయ్యేలా ఈ వీడియో ఎడిటింగ్ ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఆమాత్రం ఎగ్జైట్ అవ్వడంలో తప్పులేదు.