Begin typing your search above and press return to search.

ప్రభాస్ బర్త్ డే.. అంత రిస్క్ అయితే చేయరు కదా?

ఒకే రోజు ఇన్ని అప్‌డేట్లు రావడం అనేది ఒకరకంగా కత్తిమీద సాము లాంటిది. అభిమానుల ఆనందం, అంచనాలు హై లెవెల్లో ఉంటాయి.

By:  M Prashanth   |   17 Oct 2025 3:00 AM IST
ప్రభాస్ బర్త్ డే.. అంత రిస్క్ అయితే చేయరు కదా?
X

డార్లింగ్ ఫ్యాన్స్‌కు సెలబ్రేట్ చేసుకునే టైమ్ దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ప్రభాస్ పుట్టినరోజు వైబ్స్ ఈసారి గట్టిగానే హైలెట్ కానున్నట్లు అర్ధమవుతుంది. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ఈసారి కూడా దానికి మించి ప్లాన్ జరుగుతున్నట్లు ఒక భారీ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే నెవ్వర్ బిఫోర్ అనే లైనప్ తో ప్రభాస్ సినిమాలు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఒక దానితో మరొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేశాడు.

ఇక నెక్స్ట్ లైన్ లో ఉన్న 'ది రాజా సాబ్' ఫస్ట్ సింగిల్ నుంచి మొదలుకొని, 'ఫౌజీ' టైటిల్ ఫస్ట్ లుక్, 'సలార్-2' అనౌన్స్‌మెంట్, 'కల్కి-2' అన్‌సీన్ పోస్టర్, 'స్పిరిట్' నుంచి సర్‌ప్రైజ్.. ఇలా ఒకే రోజు ఏకంగా ఐదు సినిమాల నుంచి అప్‌డేట్ల సునామీ రాబోతోందని ప్రచారం జరుగుతోంది. వినడానికి ఇది ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ లా ఉన్నా, ప్రాక్టికల్‌గా చూస్తే దీని వెనుక ఒక పెద్ద రిస్క్ కూడా దాగి ఉంది.

ఒకే రోజు ఇన్ని అప్‌డేట్లు రావడం అనేది ఒకరకంగా కత్తిమీద సాము లాంటిది. అభిమానుల ఆనందం, అంచనాలు హై లెవెల్లో ఉంటాయి. ప్రభాస్ లైనప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ప్రపంచానికి ఒకేసారి తెలిసిపోతుంది. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకేసారి ఇన్ని అప్‌డేట్లు రావడం వల్ల, ఏ ఒక్క దానికీ పూర్తిస్థాయిలో హైప్ దక్కకపోవచ్చు. ఒక అప్‌డేట్ గురించి మాట్లాడుకునేలోపే, మరో అప్‌డేట్ వచ్చి దాని వైబ్‌ను డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది. ఫోకస్ మొత్తం చెల్లాచెదురై, దేనికీ సరైన ఇంపాక్ట్ లేకుండా పోతుంది.

అంతకంటే ముఖ్యమైన విషయం, ఒక సినిమా వైబ్ మరొక సినిమాపై ప్రభావం చూపడం. ఉదాహరణకు, 'ది రాజా సాబ్' పాట అద్భుతంగా ఉండి, 'ఫౌజీ' ఫస్ట్ లుక్ కాస్త నిరాశపరిస్తే, ఆ నెగటివిటీ పాజిటివ్‌ను డామినేట్ చేస్తుంది. ఒక అప్‌డేట్ తేడా కొట్టినా, దాని ప్రభావం మిగిలిన అప్‌డేట్లపై పడి, మొత్తం సెలబ్రేషన్ మూడ్ దెబ్బతినే అవకాశం ఉంది. అప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

అసలు ఇన్ని వేర్వేరు నిర్మాణ సంస్థలు, వేర్వేరు దర్శకులు ఒకే రోజు కోసం పర్ఫెక్ట్‌గా కోఆర్డినేట్ చేసుకోవడం కూడా సవాలుతో కూడుకున్న పనే. ప్రతి నిర్మాత తమ సినిమాకు స్పెషల్ అటెన్షన్ కోరుకుంటారు. కాబట్టి, ఈ లిస్ట్‌లోని అన్నీ అప్‌డేట్లు ఒకే రోజు రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. బహుశా ఇందులో రెండు లేదా మూడు మేజర్ అప్‌డేట్లు మాత్రమే అధికారికంగా వచ్చి, మిగిలినవి వాయిదా పడవచ్చు. అందులో రాజాసాబ్ నుంచి అప్డేట్ పక్కాగా ఉంటుంది. ఇక మిగిలిన సినిమాలలో ఒకటి రెండు పోస్టర్స్ తో సరిపెట్టవచ్చు.

మొత్తానికి, ఈ అప్‌డేట్ల తుఫాను వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నా, మేకర్స్ మాత్రం ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అక్టోబర్ 23 వరకు ఆగాల్సిందే. ఇక ఆ తర్వాత వారం రోజులకు, అక్టోబర్ 31న 'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్‌తో ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ సిద్ధంగా ఉంది.