ప్రభాస్ లో అన్నయ్య కోణం.. ఎంత ప్రేమో..
'మిర్చి' సినిమాలో ప్రభాస్‌ను చూసి బ్రహ్మానందం ఓ డైలాగ్ వేస్తారు. ఇలాగైతే ఈ రాష్ట్రంలో ఏ అమ్మాయికీ అన్నయ్య కాలేవంటూ సరదాగా అంటారు.
By: M Prashanth | 23 Oct 2026 10:42 AM IST'మిర్చి' సినిమాలో ప్రభాస్‌ను చూసి బ్రహ్మానందం ఓ డైలాగ్ వేస్తారు. ఇలాగైతే ఈ రాష్ట్రంలో ఏ అమ్మాయికీ అన్నయ్య కాలేవంటూ సరదాగా అంటారు. ఆ సీన్ అప్పట్లో బాగా పేలింది. కానీ నిజ జీవితంలో ప్రభాస్‌కు అన్నయ్య అని పిలిచేవాళ్లు చాలామందే ఉన్నారు. అందులోనూ సినిమా ఇండస్ట్రీలోని కొన్ని కుటుంబాలతో డార్లింగ్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత పెట్టిన బర్త్‌డే పోస్టు కూడా అదే విషయాన్ని గుర్తుచేస్తోంది.
ప్రభాస్‌ను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్ చేసిన లిఖిత, 'హ్యాపీ బర్త్‌డే టు మై ఫౌజీ' అంటూ విషెస్ చెప్పారు. చివర్లో 'అన్నయ్య' అనే హ్యాష్‌ట్యాగ్ జోడించారు. గతేడాది కూడా ప్రభాస్‌ను టీ రెక్స్ అంటూ సరదాగా పిలిచారు. 'సలార్' కోసం కలిసి పనిచేసిన తర్వాత ప్రశాంత్ నీల్ కుటుంబంతో ఏర్పడిన సాన్నిహిత్యం ఇలా వ్యక్తిగత వేడుకల వరకు వెళ్లింది. ఫొటోలో ప్రభాస్ ఆమె చెంపపై ముద్దు పెట్టిన తీరు కూడా ఆ అనుబంధాన్ని చూపిస్తోంది.
ఇలాంటి అనుబంధం ప్రభాస్‌కు రాజమౌళి కుటుంబంతోనూ ఉంది. 'ఛత్రపతి' రోజుల నుంచి మొదలైన పరిచయం 'బాహుబలి' సమయంలో మరింత బలపడింది. రాజమౌళి భార్య రమ, కీరవాణి భార్య శ్రీవల్లి, వారి కుటుంబ సభ్యులతో ప్రభాస్‌కు మంచి బ్రదర్ లాంటి ఉంది. రాజమౌళి, కీరవాణి కుటుంబాల్లోని పిల్లలతోనూ ఆయన సరదాగా ఉంటారని ఇండస్ట్రీలో తెలిసిన విషయమే. సినిమా పూర్తయినా ఆ కుటుంబాలతో పరిచయాలు కొనసాగుతున్నాయి.
ఇక వైజయంతీ మూవీస్ కుటుంబంతోనూ ప్రభాస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. 'కల్కి' కోసం అశ్వినీదత్ కుటుంబంతో చాలాకాలం కలిసి పనిచేశారు. నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ కూడా ప్రభాస్‌తో ఎంతో సన్నిహితంగా ఉంటారు. షూటింగ్ సమయంలోనే కాకుండా సినిమా ప్రమోషన్లలోనూ వాళ్ల మధ్య ఉన్న ఆ బ్రదర్ బాండింగ్ కనిపించింది. భారీ పాన్ ఇండియా స్టార్ అయినా నిర్మాతల కుటుంబాలతో ఇంతలా కలిసిపోవడం ప్రభాస్‌కు అలవాటైన విషయం.
అయితే ప్రభాస్‌కు అసలైన చెల్లెళ్ల సందడి ఇంట్లోనే ఉంది. కృష్ణంరాజు కూతుళ్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. గతంలో ప్రకీర్తి తమ అన్నయ్య గురించి చెప్పిన సంగతులు కూడా వైరల్ అయ్యాయి. చిన్నప్పుడు తన చేతిలో చాక్లెట్ లాక్కుని తినేవారని, కోపంతో కొట్టినా నవ్వేవారని చెప్పారు. పుట్టినరోజులు, రాఖీ పండగలకు ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చేవారని కూడా పంచుకున్నారు.
ప్రభాస్‌కు కృష్ణంరాజు కుటుంబంతో ఉన్న బంధం సినిమాల వరకు కూడా వచ్చింది. ప్రసీద నిర్మాతగా వ్యవహరించిన 'రాధేశ్యామ్'లో ప్రభాస్ హీరోగా నటించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించడం, వాళ్లకు నచ్చిన బహుమతులు తీసుకురావడం వంటి అలవాట్ల గురించి ప్రకీర్తి గతంలో వివరించారు.
