Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి. వీరిద్ద‌రి కెమిస్ట్రీకి స‌ప‌రేట్ ఫ్యాన్ బేసే ఉంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Aug 2025 3:41 PM IST
Prabhas Anushka Reunited After 8 Years, Fans Celebrate
X

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి. వీరిద్ద‌రి కెమిస్ట్రీకి స‌ప‌రేట్ ఫ్యాన్ బేసే ఉంది. ప్ర‌భాస్- అనుష్క మ‌ధ్య అంత‌లా కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవ‌డానికి కార‌ణం వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న స్నేహం కూడా. వీరిద్ద‌రూ క‌లిసి ఆఖ‌రిగా క‌లిసి క‌నిపించింది బాహుబ‌లి2లో. ఆ త‌ర్వాత మ‌రెక్క‌డా వీరు క‌లుసుకున్న‌ది కూడా లేదు. అయితే ఇప్పుడు ప్ర‌భాస్, అనుష్క మ‌రోసారి క‌లిసి క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ కోసం..

అయితే ఈసారి ప్ర‌భాస్, అనుష్క క‌లిసి క‌నిపించ‌నుంది సినిమాలో కాదు, ఓ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలో. బాహుబ‌లి సినిమా ప‌దేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆ సినిమా స‌మ‌యంలో వారి జ‌ర్నీ గురించి ఇద్ద‌రూ చ‌ర్చించుకునేలా ఈ ఇంట‌ర్వ్యూ ఉంటుంద‌ని అంటున్నారు. అయితే ఈ ఇంట‌ర్వ్యూ గురించి ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఈ వార్త విని ఫ్యాన్స్ మాత్రం చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు

బాహుబ‌లి సినిమాతో అటు అనుష్క, ఇటు ప్ర‌భాస్ ఇద్ద‌రికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా కేవ‌లం రికార్డుల‌ను సృష్టించ‌డంతో ఆగ‌కుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆడియ‌న్స్ ను తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. ఆ త‌ర్వాత బాహుబ‌లికి సీక్వెల్ గా బాహుబ‌లి2 రాగా ఆ సినిమా కూడా భారీ క‌లెక్ష‌న్ల‌ను అందుకోవ‌డంతో పాటూ ఎన్నో రికార్డుల‌ను సృష్టించింది.

ఫ్యాన్స్ ఎదురుచూపులు

ప్ర‌భాస్, అనుష్క ఆఖ‌రిగా క‌లిసి క‌నిపించింది బాహుబ‌లి2 టైమ్ లోనే. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ క‌నిపిస్తున్నార‌ని తెలియ‌డంతో ఫ్యాన్స్ వారి రీయూనియ‌న్ కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వారిద్ద‌రూ క‌లుస్తారా? వారిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృత‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్, అనుష్క‌ల రీయూనియ‌న్ ఎప్పుడు జ‌రుగుతుందో కానీ అది జ‌రిగిన‌ప్పుడు సోష‌ల్ మీడియా మొత్తం వారి ఫోటోలు, వీడియోలతో షేక్ అవ‌డం ఖాయం.