Begin typing your search above and press return to search.

డార్లింగ్ పేరిట మ‌రో అరుదైన రికార్డు

కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ త‌క్కువ టైమ్ లోనే హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Feb 2026 3:42 PM IST
డార్లింగ్ పేరిట మ‌రో అరుదైన రికార్డు
X

కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ త‌క్కువ టైమ్ లోనే హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబ‌లి సినిమాతో విప‌రీత‌మైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్ర‌భాస్ ఆ త‌ర్వాత ప్ర‌తీ సినిమాతో త‌న క్రేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు. సినిమా సినిమాకీ త‌న ఫాలోయింగ్ తో పాటూ మార్కెట్ ను పెంచుకుంటూ వ‌స్తున్న డార్లింగ్ పేరిట ఇప్ప‌టికే ఎన్నో రికార్డులున్నాయి.





తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న డార్లింగ్ బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెర‌కెక్కడంతో ఆయ‌న త‌న రేంజ్ పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి పెరిగింది. అందుకే ప్ర‌భాస్ కు ఇండియానే కాకుండా విదేశాల్లో కూడా తిరుగులేని స్టార్‌డ‌మ్ సొంత‌మైంది. ఆయ‌న్నుంచి కొత్త సినిమా వ‌స్తుందంటే కేవ‌లం తెలుగు ఆడియ‌న్స్ కు మాత్ర‌మే కాకుండా విదేశాల్లోని మూవీ ల‌వ‌ర్స్ కు కూడా పండ‌గే.

అన‌న్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పై ప్ర‌భాస్

ఇక అస‌లు విష‌యానికొస్తే ప్ర‌భాస్ ఇప్పుడో స‌రికొత్త రికార్డును సృష్టించారు. జ‌పాన్ కు చెందిన ప్ర‌ముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అన‌న్ మ్యాగ‌జైన్ బ్యాక్ క‌వ‌ర్ పై ప్ర‌భాస్ క‌నిపించి రికార్డు నెల‌కొల్పారు. ఈ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పై క‌నిపించ‌నున్న తొలి ఇండియ‌న్ సోలో హీరో ప్ర‌భాసే కావ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రి 10న ఈ మ్యాగ‌జైన్ ఇష్యూ నెంబ‌ర్ 2483 బ్యాక్ క‌వ‌ర్ పై ప్ర‌భాస్ ఫోటో ఉండ‌నుంది.

గ‌తంలో మ్యాగ‌జైన్ పై క‌నిపించిన ఎన్టీఆర్, చ‌ర‌ణ్

ఈ మ్యాగ‌జైన్ లో ప్ర‌భాస్ కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న ఆద‌ర‌ణ‌ను, మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌కు జ‌పాన్ ఆడియ‌న్స్ లో ఏర్ప‌డిన అభిమానాన్ని స్పెష‌ల్ గా ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. అయితే గ‌తంలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ త‌ర్వాత రామ్ చ‌రణ్, ఎన్టీఆర్ క‌లిసి ఆ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పై క‌నిపించ‌గా, ఇప్పుడు ప్ర‌భాస్ కు సోలోగా ఆ గౌర‌వం ద‌క్క‌డం విశేష‌మ‌నే చెప్పాలి. కాగా ఇప్ప‌టికే ఆ క‌వ‌ర్ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది

ఇక ప్ర‌భాస్ కు జ‌పాన్ లో ఈ రేంజ్ క్రేజ్ రావ‌డానికి మెయిన్ రీజ‌న్ బాహుబ‌లి సిరీస్. బహుబ‌లి సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచే ప్ర‌భాస్ సినిమాలు జ‌పాన్ లో కూడా రిలీజ‌వుతూ మంచి ఆద‌ర‌ణ పొందుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన క‌ల్కి 2898ఏడి కూడా అక్క‌డ స‌క్సెస్‌ఫుల్ గా ప్ర‌ద‌ర్శిత‌మైంది. ఆ ప్ర‌మోష‌న్స్ టైమ్ లోనే ప్ర‌భాస్ త్వ‌ర‌లో జ‌పాన్ వ‌స్తాన‌ని ఫ్యాన్స్ కు మాటివ్వ‌గా, ఆ మాట మేర‌కే గ‌త డిసెంబర్ లో ప్ర‌భాస్ టోక్యో వెళ్లారు. బాహుబ‌లి ది ఎపిక్ స్పెష‌ల్ షోల సంద‌ర్భంగా జ‌రిగిన ఈ టూర్ లో త‌న ఫ్యాన్స్ ప్రేమ‌ను చూసి ఎమోష‌న‌ల్ అయ్యారు. అదే టైమ్ లో ఈ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫోటో షూట్ కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.

వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ప్ర‌భాస్

ఇక సినిమాల విష‌యానికొస్తే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలు సెట్స్ పై ఉండ‌గా త్వ‌ర‌లోనే క‌ల్కి2 షూటింగ్ కూడా మొద‌ల‌వ‌నుంది. రీసెంట్ గా ప్ర‌భాస్ నుంచి సంక్రాంతి కానుకగా రిలీజైన రాజా సాబ్ సినిమాకు మిక్డ్స్ టాక్ రాగా, తాజాగా ఈ సినిమా జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వ‌చ్చింది. ఓ వైపు నేష‌న‌ల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూనే మ‌రోవైపు వ‌రుస సినిమాల‌తో ప్ర‌భాస్ త‌న క్రేజ్ ను రోజురోజుకీ పెంచుకుంటూ ఉన్నారు.