షాకింగ్.. నాలుగు సెట్ల మధ్య ప్రభాస్ 'జగ్‌లింగ్'!
ఒకటి కంటే ఎక్కువ సినిమాల సెట్ల మధ్య తిరగడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి సినిమాకూ ఒక ప్రత్యేకమైన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అవసరం ఉంటుంది.
By: M Prashanth | 21 Jan 2026 8:59 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 2026 సంవత్సరం ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత బిజీ ఇయర్ కాబోతోంది. చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఒకేసారి షూటింగ్ దశకు చేరుకోవడంతో, ఆయన ఏకకాలంలో నాలుగు సెట్ల మధ్య తిరగాల్సి వస్తోంది. ఒక భారీ సినిమా పూర్తి చేయడమే కష్టమైన ఈ రోజుల్లో, ప్రభాస్ ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
రీసెంట్ గానే ప్రభాస్ స్పిరిట్ ని సెట్స్ పైకి తీసుకు వచ్చి ఒక కీలక షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు. మరోవైపు 'కల్కి 2' సెట్స్‌లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా తెరకెక్కిన మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న 'స్పిరిట్' షూటింగ్‌లో కూడా ఆయన పాల్గొనాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా హై ఓల్టేజ్ ప్రాజెక్టులు కావడంతో ప్రభాస్ వీటి కోసం చాలా ఎనర్జీని కూడబెట్టుకోవాల్సి ఉంటుంది.
కేవలం ఇక్కడితోనే అయిపోలేదు.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడిక్ డ్రామా 'ఫౌజీ' షూటింగ్ ని ఇదే ఏడాది ఫినిష్ చేయాల్సి ఉంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న 'సలార్ 2' కోసం కూడా ప్రభాస్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఇలా ఒకే సమయంలో భిన్నమైన జానర్స్ ఉన్న సినిమాలను హ్యాండిల్ చేయడం ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అని చెప్పవచ్చు.
ఒకటి కంటే ఎక్కువ సినిమాల సెట్ల మధ్య తిరగడం అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి సినిమాకూ ఒక ప్రత్యేకమైన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అవసరం ఉంటుంది. 'కల్కి'లో భైరవగా, 'స్పిరిట్'లో పవర్‌ఫుల్ పోలీస్‌గా, 'ఫౌజీ'లో ఆర్మీ ఆఫీసర్‌గా ఇలా వేర్వేరు పాత్రల్లో కనిపించడం ప్రభాస్‌కు ఒక పెద్ద టాస్క్. కానీ తన ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అందించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అయితే, ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆయన ఆరోగ్యంపై ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలని సన్నిహితులు కోరుతున్నారు. రీసెంట్ గా వచ్చిన 'ది రాజాసాబ్' ఫలితం కొంత నిరాశ కలిగించినా, ప్రభాస్ మాత్రం తగ్గకుండా ఈ భారీ లైనప్‌ను సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలు గనుక పక్కాగా ప్లాన్ చేసినట్లు రిలీజ్ అయితే, బాక్సాఫీస్ వద్ద ఒక్కోటి వెయ్యి కోట్ల వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. ఏదేమైనా 2026 ప్రభాస్ తీరిక లేకుండా మేకప్ వేసుకోబోతున్నాడు. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేయడం అంటే అది మామూలు షాక్ కాదు. మరి ఈ 'జగ్‌లింగ్' ప్రభాస్ కెరీర్‌ను ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.
