డార్లింగ్ 2.0 లోడింగ్..దెబ్బతో రూట్ మార్చారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు.' బాహుబలి'తో గ్లోబల్ వైడ్‌గా సంపాదించుకున్న ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడంలో ఇటీవల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.
By: Srikanth Kontham | 16 March 2026 4:00 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు.' బాహుబలి'తో గ్లోబల్ వైడ్‌గా సంపాదించుకున్న ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడంలో ఇటీవల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన 'ది రాజా సాబ్' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు తన రూటును పూర్తిగా మార్చేస్తున్నారు. ఇకపై చూడబోయేది పాత ప్రభాస్‌ను కాదు. పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్‌గా ఉండే ప్రభాస్ 2.0ను అని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈ మార్పు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా? ఆయన వ్యక్తిగత శైలిలో కూడా కనిపిస్తోంది.
ప్రభాస్ 2.0లో మొదటి మార్పు ఆయన లుక్. గత కొన్ని చిత్రాల్లో ప్రభాస్ విజువల్స్ , ఫిజిక్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా? డార్లింగ్ ఇప్పుడు తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కఠినమైన డైట్ , వర్కవుట్స్ చేస్తూ మళ్ళీ 'మిర్చి', 'బిల్లా' కాలం నాటి పర్ఫెక్ట్ షేప్‌లోకి వస్తున్నట్లు సమాచారం. రాబోయే చిత్రాల్లో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా గ్లామరస్‌గా, అత్యంత ఎనర్జిటిక్‌గా కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
కేవలం లుక్ మాత్రమే కాదు. కథల ఎంపికలో కూడా ప్రభాస్ తన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు కేవలం భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన ఇకపై కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యత ఇచ్చేలా సిద్దమవుతున్నారు . ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా ఫౌజీ`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. ఇలా ఏక కాలంలో రెండు సినిమాలు చేయడం డార్లింగ్ కి కొత్తేం కాదు.
అలాగే ఆఫ్ స్క్రీన్ కూడా ప్రభాస్ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుపటి కంటే ఎక్కువగా పబ్లిక్ అప్పీరెన్స్ ఇవ్వడం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటం పెరిగింది. సోషల్ మీడియా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడం వంటివి ప్రభాస్ 2.0 స్ట్రాటజీలో భాగం కాన్నున్నాయి. ఇంటర్వ్యూలలో తన అంతర్ముఖ స్వభావాన్ని పక్కన పెట్టి మరింత ఓపెన్‌గా మాట్లాడాలని నిర్ణయించుకున్నారట. ఇది గ్లోబల్ ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ఎంతో దోహద పడే అవకాశం ఉంది.
