దేఖ్ లేంగే సాలా కు ఆ డైరెక్టర్ ఫిదా
దేఖ్ లేంగే సాలా అంటూ సాగే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకుల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 15 Dec 2025 4:46 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
దేఖ్‌లేంగే సాలాకు మంచి రెస్పాన్స్
దేఖ్ లేంగే సాలా అంటూ సాగే ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకుల్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. పైగా ఈ సాంగ్ లో పవర్ స్టార్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్ ను ఎంతో అలరించడంతో పాటూ ఆ స్టెప్పులు చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇప్పటికే పవన్, దేవీ శ్రీ ప్రసాద్ కలయికలో పలు సినిమాలు రాగా, అవన్నీ చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అయ్యాయి.
స్టెప్పులతో ఆకట్టుకున్న పవర్ స్టార్
వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్నీ మ్యూజికల్ హిట్సే. అంతేకాదు, గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవీ శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ అనే సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్ లో పవన్ వేసిన స్టెప్పుల్లో గ్రేస్ బాగా కనిపిస్తోంది. మనకేమైనా సమస్యలొచ్చినప్పుడు స్పూర్తినిచ్చేలా ఈ సాంగ్ ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ చెప్పగా, ఈ మూవీ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్ అద్భుతంగా ఉంటుందని, సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని నిర్మాత నవీన్ యేర్నేని చెప్పారు.
ఇదిలా ఉంటే దేఖ్ లేంగే సాలా సాంగ్ కు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సాంగ్ గురించి ఓ స్పెషల్ వీడియో రాబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్ కు ఈ పాట తెగ నచ్చేసిందని, ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియో కూడా రాబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత తనకు డ్యాన్స్ వేయాలనిపిస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలోని సాంగ్ విని తనతో అన్నారని గతంలో దేవీ శ్రీ ప్రసాద్ చెప్పింది బహుశా ఈ పాట గురించేనేమో అని ఇప్పుడంతా అనుకుంటున్నారు.
