Begin typing your search above and press return to search.

సందీప్ నెక్స్ట్ మాత్రం గట్టిగానే.. ఎందుకంటే..

రీసెంట్ గా వచ్చిన సిగ్మా రిజల్ట్ తో సందీప్ కిషన్ కాస్త డిజప్పాయింట్ అయ్యాడనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు.

By:  M Prashanth   |   5 Oct 2026 5:00 PM IST
సందీప్ నెక్స్ట్ మాత్రం గట్టిగానే.. ఎందుకంటే..
X

రీసెంట్ గా వచ్చిన సిగ్మా రిజల్ట్ తో సందీప్ కిషన్ కాస్త డిజప్పాయింట్ అయ్యాడనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ గ్యాప్ లోనే సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద గట్టిగానే ఫోకస్ పెట్టాడు. అదే పవర్ పేట. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా అవుట్ పుట్ మీద ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఓ రేంజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. సిగ్మా ఇచ్చిన షాక్ ను ఈ పొలిటికల్ డ్రామాతో పక్కాగా కవర్ చేసేలా ఉన్నాడని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట.

డైరెక్టర్ కృష్ణ చైతన్య ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయనకు ఈ రస్టిక్ పాలిటిక్స్ జోన్ వెన్నతో పెట్టిన విద్య. రౌడీ ఫెలో, మొన్నటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూస్తే లోకల్ పాలిటిక్స్, పవర్ గేమ్స్, మనుషుల మధ్య ఉండే ఈగో క్లాషెస్ ను ఆయన ఎంత 'రా'గా డీల్ చేస్తారో అర్థమవుతుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి టాక్ కాస్త వేరేగా వచ్చినా సరే అందులో క్యారెక్టరైజేషన్స్, సెటప్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు పవర్ పేట కోసం మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్ లోకే దిగిపోయాడు ఈ డైరెక్టర్.

పవర్ పేట ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా థీమ్ ఏంటనేది క్లియర్ గా హింట్ ఇచ్చేశారు. రక్తం అంటిన చెస్ బోర్డు, పగిలిపోయిన పావులు చూస్తుంటేనే ఇదొక మైండ్ గేమ్ అని తెలుస్తోంది. లవ్, ఆనర్, పాలిటిక్స్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ సేనాపతి రవి అనే పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎప్పుడూ లవర్ బాయ్ లేదా యాక్షన్ ఇమేజ్ లో కనిపించే సందీప్ కు, ఇలాంటి ఇంటెన్స్ పాలిటిక్స్ ఉన్న క్యారెక్టర్ పడితే యాక్టింగ్ కు ఫుల్ స్కోప్ దొరికినట్లే.

నిజానికి సందీప్ కు ఇప్పుడు అర్జెంట్ గా కావాల్సింది కూడా ఇలాంటి రూటెడ్ సబ్జెక్టే. డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నా థియేటర్ల దగ్గర నిలబడే ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. ఈ టైమ్ లో రొటీన్ మాస్ సినిమాలు కాకుండా, ఇలా ఎమోషన్స్, పొలిటికల్ ప్రెజర్ ఉన్న క్యారెక్టర్ ఎంచుకోవడం డెఫినెట్ గా సేఫ్ హిట్ అనే చెప్పాలి.

పాత్రలో ఉండే ఇంటెన్సిటీ సందీప్ లోని మరో యాంగిల్ ను బయటకు తీస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు వెనుక ఉన్న టెక్నికల్ టీమ్ చూస్తేనే బజ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేయబోతుంటే, మధి లాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ విజువల్స్ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా తగ్గడం లేదట. మొత్తానికి కంటెంట్ పరంగా, టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న పవర్ పేటతో సందీప్ ఈసారి గట్టిగానే కొట్టేలా కనిపిస్తున్నాడు.