ఛాన్స్ అడిగితే ఉన్న పళంగా వచ్చేయ్!
ఇండస్ట్రీలో అసిస్టెంట్ రైటర్లగా, ఘోస్ట్ రైటర్లగా అవకాశం రావాలంటే నెలల తరబడి వెంట తిరిగితే తప్ప సాధ్యం కాదు.
By: Srikanth Kontham | 26 Aug 2025 2:00 PM ISTఇండస్ట్రీలో అసిస్టెంట్ రైటర్లగా, ఘోస్ట్ రైటర్లగా అవకాశం రావాలంటే నెలల తరబడి వెంట తిరిగితే తప్ప సాధ్యం కాదు. ఎంత ట్యాలెంట్ ఉన్నా? దాన్ని గుర్తించడానికి సీనియర్ రైటర్లు చాలా సమయం తీసుకుంటారు. తమకు అంతా అనుకూలంగా ఉంటేనే ఛాన్స్ లు కల్పిస్తుంటారు. లేదంటే తమ వద్ద ఖాళీలు లేవని తిప్పి పంపిస్తారు. కానీ సీనియర్ రైటర్ కం నటుడు పోసాని కృష్ణ మురళి తీరు మాత్రం ఈ విషయం ఎంతో భిన్నం. ఛాన్స్ అడగాలే గాని ఉన్న పళంగా అన్ని వదిలేసి వచ్చేయ్ అని ధైర్యంగా చెబుతారని ఓ రైటర్ కం నటుడు తెలిపారు.
ఇండస్ట్రీలో పోసానితో తనకెదురైనా అనుభవాన్ని పంచుకున్నారాయన. సినిమాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో పోసాని దగ్గరకు వెళ్లి మీ దగ్గరగా రైటర్ గా ఛాన్స్ ఇవ్వండని అడిగారట. అందుకు పోసాని వెంటనే ఉద్యోగానికి వెళ్లి రాజీనామా చేసి రేపు ఉదయాన్ని తన ఆఫీస్ కు వచ్చేయమని ఆర్డర్ వేసారట. అప్పటికే 6 వేల జీతంతో జీవతం సాపీగా, సేఫ్ గా సాగిపోతున్న సమయం అది. దీంతో పోసాని ఉన్న పళంగా వచ్చేయమనడంతో ఏం చేయాలో? తెలియక అర్దం కాక నిర్ణయం తీసుకోలేక పోయానన్నారు.
కానీ పోసాని లా ఎవరూ అవకాశం కల్పించలేరని..అవకాశం అడిగితే ఇంకే విషయం ఆలోచించకుండా ఛాన్స్ ఇచ్చేది పోసానిగా పేర్కొన్నారు. అప్పటికే పోసాని రైటర్ గా పుల్ బిజీగా ఉన్నారు. పెద్ద హీరోల సినిమాలకు పని చేస్తున్నారు. ఆయన వద్ద అప్పట్లో అవకాశం అంటే చిన్న విషయం కాదు. ఎంతో మంది ఆయన కాంపౌండ్ నంచి వచ్చి రైటర్లుగా, డైరెక్టర్లుగా ఎదిగారు. కొరటాల శివ, బోయపాటి శ్రీను కూడా పోసాని శిష్యులే అన్న సంగతి తెలిసిందే.
అంతే కాదు పోసాని కొన్ని సినిమాలను స్వీయా దర్శకత్వంలో నిర్మించారు. రొటీన్ కు భిన్నమైన సినిమాలు తీయడం పోసాని ప్రత్యేకత. ఓ రకంగా ఆయనలో అప్పుడప్పుడు కన్నడ నటుడు ఉపేంద్ర కనిపిస్తుంటారు. అయితే కొంత కాలంగా పోసాని పెద్దగా సినిమాలు చేయడం లేదు. రాజకీయం, సినిమా అంటూ రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్ట లేదనే ప్రచారం జరుగుతోంది. నటనతో పాటు, రైటింగ్ కి కూడా దూరంగా ఉన్నారు.
