యాంకర్ కొంటె ప్రశ్న.. లైవ్‌లోనే ఖంగుతిన్న టాలీవుడ్ దర్శకుడు!
సినిమా ప్రమోషన్స్ సమయంలో నటీనటులు, దర్శకులకు ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడం సహజమే.
By: Sivaji Kontham | 22 July 2026 10:14 AM ISTసినిమా ప్రమోషన్స్ సమయంలో నటీనటులు, దర్శకులకు ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడం సహజమే. అయితే ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో అపజయమెరుగని ఒక ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడికి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈవెంట్లో ఇంటర్వ్యూ చేస్తోన్న యాంకర్ అడిగిన ఒక కొంటె ప్రశ్నతో సదరు దర్శకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ప్రత్యక్ష ప్రసారం (లైవ్) జరుగుతుండగానే ఆ కంగారును దాచుకోలేక ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
"మీరు వదలకుండా పదే పదే పని చేయాలనిపించే హీరోయిన్ ఎవరో... చెప్పండి ప్లీజ్!" అంటూ ఆ యాంకర్ పదే పదే ఒత్తిడి చేస్తూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ మాటల్లోని ద్వంద్వార్థం (డబుల్ మీనింగ్) సౌండింగ్‌కు సదరు దర్శకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సమయంలో ఇలాంటి ప్రశ్న వద్దంటూ.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అయితే సదరు హీరోయిన్ పేరును బయటకు చెప్పడానికి ఆయన ఎంతమాత్రం సిద్ధంగా లేరని ఆ లైవ్ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఇట్టే అర్థమైపోయింది.
నిజానికి ఆ ప్రముఖ దర్శకుడికి, ఒక యువ నటికి మధ్య ఎఫైర్ ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన వరుసగా తన సినిమాల్లో ఆ నటికే అవకాశాలు ఇవ్వడంతో ఈ తరహా ప్రచారం ఊపందుకుంది. అయితే వారిద్దరి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమే అని సినీ వర్గాలు చెబుతుంటాయి. కానీ గతంలో వచ్చిన ఈ రూమర్లను మర్చిపోయి సదరు యాంకర్ యథాలాపంగానే ఆ ప్రశ్న అడిగినా.. అక్కడున్న వారందరికీ అసలు మ్యాటర్ ఏంటో వెంటనే కనెక్ట్ అయిపోయింది. ఆ సమయంలో ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని ఊహించని ఆ దర్శకుడు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.
ఇలాంటి ఘటనలు తెలుగు సినిమా వేదికలపై కొత్తేమీ కాదు. గతంలోనూ పలు ఆడియో ఫంక్షన్లు, ప్రెస్ మీట్లలో యాంకర్లు పబ్లిసిటీ కోసం లేదా సరదా కోసం కొంటెగా చిలిపి ప్రశ్నలు అడిగి హీరోలను, దర్శకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగత విషయాలు... రూమర్లు లేదా ద్వంద్వార్థాలు వచ్చేలా యాంకర్లు వేసే పంచ్‌లకు వేదికపై ఉన్న సెలబ్రిటీలు నవ్వుతూ దాటవేయడమో లేక సీరియస్ అవ్వడమో జరుగుతుంటుంది. సినిమా ప్రమోషన్లలో గ్లామర్- వినోదం పేరుతో పరిమితులు దాటి అడిగే ఇలాంటి ప్రశ్నలు కొన్నిసార్లు వివాదాలకు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి.
