Begin typing your search above and press return to search.

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా హవా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా!

ముఖ్యంగా ఇద్దరు సూపర్‌స్టార్ల సినిమాల్లో వరుసగా కనిపించడం ఆమెకు సంబంధించిన కొత్త డిస్క‌ష‌న్‌కు కారణమవుతోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Aug 2026 10:44 AM IST
ఒక‌ప్పుడు హీరోయిన్‌గా హవా.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా!
X

ఒకప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూర్ణ.. ఇప్పుడు తన కెరీర్‌ను మరో విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. లీడ్ రోల్స్‌తో పాటు కీలక పాత్రలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం భారీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ప్రత్యేక ప్రదర్శనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు సూపర్‌స్టార్ల సినిమాల్లో వరుసగా కనిపించడం ఆమెకు సంబంధించిన కొత్త డిస్క‌ష‌న్‌కు కారణమవుతోంది.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో పూర్ణ కుర్చీ మడతపెట్టి సాంగ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. సినిమాలో ఆమె కనిపించే టైమ్ లిమిటెడ్ అయినప్పటికీ, ఆ సాంగ్‌లో ఆమె ఎనర్జిటిక్ మూవ్స్ ఆడియ‌న్స్ ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. దీంతో పూర్ణకు మరోసారి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఒక స్పెష‌ల్ సాంగ్ ద్వారా కూడా తన ఉనికిని బలంగా చాటుకోవచ్చని ఆమె ఆ సాంగ్‌తో చూపించారు.

ఇప్పుడ‌దే తరహాలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో పూర్ణ సందడి చేయబోతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్2 లోని ఫ‌స్ట్ సింగిల్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా ఆసక్తిని పెంచింది. ఈ ప్రోమోలో పూర్ణ ఎనర్జిటిక్ డ్యాన్స్ హైలైట్‌గా కనిపించింది. ఫుల్ సాంగ్ ఆగ‌స్ట్ 21న రిలీజ్ కానుండ‌టంతో మెయిన్ సాంగ్ లో ఆమెకు ఎంత ప్రాధాన్యత ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ విష‌య‌మేంటంటే, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజనీకాంత్ వంటి ఇద్దరు స్టార్ హీరోల భారీ సినిమాల్లో పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించడం. సాధారణంగా స్పెషల్ సాంగ్స్‌లో కనిపించే నటీనటులకు స్క్రీన్ టైమ్ లిమిటెడ్‌గానే ఉంటుంది. కానీ కొన్ని నిమిషాల నిడివిలోనే ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేయ‌డం, ఆ స్పెష‌ల్ సాంగ్‌కు మ‌రింత ఎన‌ర్జీని తీసుకొచ్చి దాన్ని ఇంకా స్పెష‌ల్ గా మార్చ‌డం కీలకం. ఈ విషయంలో పూర్ణ తనదైన స్టైల్‌ను చూపిస్తున్నారు.

అయితే జైలర్2 ప్రోమోలో పూర్ణతోనే ఎంట్రీ సీక్వెన్స్‌ను హైలైట్ చేయడం వెనుక కారణమేంటి? సాంగ్‌లోని ఎనర్జీని పెంచే కీ ఎలిమెంట్‌గా ఆమెను ఉపయోగించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఫుల్ సాంగ్ రిలీజైతే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశ‌ముంది. మొత్తానికి హీరోయిన్‌గా ఒక దశలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ, ఇప్పుడు స్టార్ హీరోల భారీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా మరోసారి తన మార్క్ చూపిస్తున్నారు. స్క్రీన్ టైమ్ కంటే స్క్రీన్‌పై కనిపించినప్పుడు కలిగే ఇంపాక్ట్‌నే ముఖ్యంగా మార్చుకుంటూ.. కెరీర్‌లో ఆమె కొత్త ఫేజ్‌ను కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.