Begin typing your search above and press return to search.

వీకెండ్ వైబ్.. ఎల్లో దుస్తుల్లో చెమటలు పట్టిస్తున్న పూనమ్!

ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ చెమటలు పట్టించేలా తన ట్రెండీ అవుట్ ఫిట్ తో హొయలు పోయింది.

By:  Madhu Reddy   |   4 July 2026 12:29 PM IST
వీకెండ్ వైబ్.. ఎల్లో దుస్తుల్లో చెమటలు పట్టిస్తున్న పూనమ్!
X

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకోవడమే కాకుండా వీకెండ్ వచ్చిందంటే చాలు స్పెషల్ గా రెడీ అయ్యి వీకెండ్ వైబ్ అంటూ కొన్ని ఫోటోలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం , ఆదివారం కావడంతో కొంతమంది సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ వేదికగా వీకెండ్స్ అంటూ షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సెగలు పుట్టించేలా ట్రెండీ అవుట్ ఫిట్ లో హీట్ పుట్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ చెమటలు పట్టించేలా తన ట్రెండీ అవుట్ ఫిట్ తో హొయలు పోయింది. ఆమె ఎవరో కాదు పూనం పాండే.. ఒకవైపు తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు తన నటనతో అలరించే ఈమె నిత్యం కాంట్రవర్సీ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈమె.. బాలీవుడ్, కన్నడ తో పాటు తెలుగు సినిమాలలో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షోల్డర్ లెస్ స్ట్రాప్ తో డిజైన్ చేసిన ఎల్లో కలర్ ఫ్రాక్ ధరించిన ఈమె.. సెగలు పుట్టించేలా టాప్ అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అటు సెల్ఫీ ఫోజులతో కుర్ర కారు గుండెల్లో గుణపాలు దింపేసింది. మొత్తానికైతే "వారాంతం వచ్చేసింది నేను ఎల్లో కలర్ ఫ్రాక్ తో మీ ముందుకు వచ్చేసాను" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది పూనమ్ పాండే. ఇక పూనమ్ పాండే షేర్ చేసిన ఈ వీకెండ్ వైబ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

1991 మార్చి 11 ఢిల్లీలో జన్మించిన ఈమె.. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. 12వ తరగతి తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. తొలిసారి 2017 గ్లాడ్ రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల పోటీలలో తొలి ఎనిమిది మందిలో ఒకరిగా నిలిచింది. ఇక అలాగే ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ పై దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. 2011లో మొత్తం 21 క్యాలెండర్లలో ఈమె చిత్రాన్ని మొదటి పేజీలో ముద్రించడం గమనార్హం. అంతేకాదు కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో కూడా దర్శనమిచ్చింది.

ఇక 2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 5లో కలకత్తా నైట్ రైడర్స్ విజయం సాధించిన తర్వాత ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ పత్రికలో అభ్యంతరకరంగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈమె చిత్రాలు ప్రచురించారు.ఆ ఫోటోలతో ఇండియాలో సంచలనం సృష్టించి.. సినీ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇక 2013లో దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు కారణం అసభ్యకరంగా ఫోజులిస్తూ.. మ్యాగజైన్ కవర్ పేజి పై అర్థనగ్నంగా కనపడే పూనమ్ లాంటి తారల వల్లే అంటూ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించింది. ఇలాంటి వాటికి తనను బాధ్యురాలిని చేయడం తగదని పేర్కొంది. అలా పలు విషయాలలో వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది పూనమ్ పాండే .

ఇకపోతే ఈమె 2013 నషా అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. 2015లో మాలిని అండ్ కో. చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.