Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు హీరోల గురించి పూజా కామెంట్స్‌

పూజా హెగ్డే ఈ ముగ్గురు హీరోలతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

By:  Ramesh Palla   |   15 July 2026 12:51 PM IST
ఆ ముగ్గురు హీరోల గురించి పూజా కామెంట్స్‌
X

హీరోయిన్‌ పూజా హెగ్డే గత ఏడాది దేవ, రెట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అంతే కాకుండా కూలీ సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం కావడంతో ఇండస్ట్రీలో దశాబ్ద కాలం దాటినా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఆ మధ్య కాస్త స్లో అయినట్లు అనిపించినా, మళ్లీ పుంజుకుంది. సౌత్‌ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్‌ సినిమాల్లోనూ ఈ అమ్మడు వరుసగా నటిస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈసారి పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల కారణంగా వైరల్‌ అవుతోంది. తాను వర్క్‌ చేసిన హీరోల గురించి పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పూజా హెగ్డే హీరోయిన్‌గా...

సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే 'కిసి కా భాయ్‌ కిసి కా జాన్‌' సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా బాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ ను దగ్గర నుంచి చూసే అవకాశం దక్కిందని, ఆయనతో వర్క్‌ చేయడం కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చిందని చెప్పుకొచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ జెన్యూన్‌ పర్సన్‌ అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. చాలా నిజాయితీగా మాట్లాడుతారని, మనసులో ఏది ఉన్నా బయటకు చెప్పేస్తారంది. ఆయనలో ఎలాంటి నటన ఉండదు, చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తారు. పైకి ఎలా కనిపిస్తారో అలాగే మాట్లాడుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత రియలిస్టిక్‌గా ఉండటం సాధ్యం కాదని, కానీ సల్మాన్‌ ఈ రోజుల్లోనూ అలాగే ఉంటున్నారు, ఆయన గొప్ప వ్యక్తి అన్నట్లుగా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌ రాధేశ్యామ్‌లో హీరోయిన్‌గా...

ప్రభాస్‌తో పూజా హెగ్డే రాధేశ్యామ్‌ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఎంపిక అయిన వెంటనే పూజా హెగ్డే సర్‌ప్రైజ్‌ అయిందట. ప్రభాస్‌తో సినిమా అనగానే చాలా మంది లాగే తాను కూడా ఫుడ్‌ గురించే ఆలోచించాను అంది. అంతా అన్నట్లుగానే, నేను అనుకున్నట్లుగానే సెట్స్‌ లో రెగ్యులర్‌గా రకరకాల ఫుడ్‌ ఉండేది. అత్యంత రుచికరమైన భోజనం ఆ సమయంలో చేశాను అని, ప్రభాస్‌ తనకు ఎప్పుడూ చూడని ఫుడ్‌ ను రుచి చూపించాడని సరదాగా పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. ఇక హృతిక్ రోషన్‌ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ డాన్స్‌ చేస్తున్న సమయంలో మ్యూజిక్‌ ను ఎంజాయ్‌ చేయడం నేర్పించాడని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా డాన్స్‌ ను చేస్తున్నప్పుడు కష్టపడకుండా, మ్యూజిక్‌ ను ఎంజాయ్‌ చేయడం ద్వారా తప్పకుండా డాన్స్ మరింత ఆకర్షణీయంగా వస్తుందని ఆ సమయంలో హృతిక్‌ తనతో చెప్పాడని పూజా హెగ్డే పేర్కొంది.

విజయ్‌ జన నాయగన్‌ సినిమా రిలీజ్‌..

పూజా హెగ్డే ఈ ముగ్గురు హీరోలతో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ఇంకా చాలా మంది స్టార్‌ హీరోలతో, సూపర్‌ స్టార్‌ హీరోలతో వర్క్‌ చేసింది. ప్రతి ఒక్క హీరో నుంచి కచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకున్నాను అన్నట్లుగానూ పూజా హెగ్డే పేర్కొంది. మొత్తానికి సోషల్‌ మీడియాలో పూజా హెగ్డే ఆ ముగ్గురు హీరోల గురించి మాట్లాడిన మాటలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే కాంచన 4 సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి నటించిన జననాయగన్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నెలలోనే జన నాయగన్‌ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి, ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.