ఆ క్రెడిట్ కార్తీక్ సర్ కే.. వాళ్లు నా మూవీలు చూడలేదేమో: పూజ హెగ్డే
కోలీవుడ్ మూవీ మాస్క్ తో తెరంగేట్రం చేసిన బ్యూటీ.. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
By: M Prashanth | 12 Aug 2025 11:21 AM ISTహీరోయిన్ పూజా హెగ్డే గురించి అందరికీ తెలిసిందే. కోలీవుడ్ మూవీ మాస్క్ తో తెరంగేట్రం చేసిన బ్యూటీ.. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూడు చిత్రాలతో ఆశించినంత రిజల్ట్ అందుకోకపోయినా.. క్రేజీ మాత్రం సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు టాలీవుడ్ లో హవా సాగించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న అమ్మడు.. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు సొంతం చేసుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాప్ స్టార్ హీరోలతో నటించిన పూజా హెగ్డే.. ఆ తర్వాత వరుస ఫ్లాప్ లు ఆమె ఖాతాలో చేరాయి. దీంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.
రీసెంట్ గా తెలుగులో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ కోలీవుడ్, బాలీవుడ్ లో బాగానే అవకాశాలు అందుకుంటోంది. విజయ్ జన నాయగన్ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఆమె.. నార్త్ లో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలో యాక్ట్ చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ మోనికలో సందడి చేయనుంది.
ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది అమ్మడు. అందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎందుకు గ్లామరస్ జోనర్ లో చూస్తుంటారని అడగ్గా.. పూజా మాట్లాడారు. ఆడియన్స్ కాదని, బాలీవుడ్ లో చాలా మంది మేకర్స్ అలా చూస్తున్నారని తెలిపారు.
"నార్త్ లో చాలా మంది చిత్ర నిర్మాతలు నన్ను కేవలం గ్లామర్ పాత్రల కోసం టైప్ కాస్ట్ చేస్తున్నారు. వారు దక్షిణ భారతదేశంలో నా సినిమాలు చూడలేదని నేను అనుకుంటున్నాను. నేను ఏ సినిమాలు చేస్తున్నానో వాళ్లకు తెలియదేమో. 2025లో విభిన్నమైన పాత్రలు చేస్తున్నా" అని తెలిపింది పూజ.
"అయితే నేను కార్తీక్ సుబ్బరాజ్ కు ఫుల్ క్రెడిట్ ఇస్తాను. ఆయన నన్ను డిఫరెంట్ గా చూశారు. నేను కూడా రుక్మిణి లాంటి రోల్స్ చేయగలనని ప్రూవ్ చేశారు. సూర్య రెట్రో మూవీలో నేను చేసిన ఆ రోల్ చాలా రేర్. రాధేశ్యామ్ లో నాకు చూసి ఫిక్స్ అయ్యారని తెలిసి షాక్ అయ్యా. ఆయన విజన్ ఉన్న డైరెక్టర్" అంటూ కార్తీక్ సుబ్బరాజ్ ను కొనియాడారు. కాగా, రెట్రో మూవీ అనుకున్న స్థాయిలో మెప్పించలేదు.
