నాలుగేళ్ల తర్వాత ఊహించని కంబ్యాక్!
అయితే దుల్కర్ మాలీవుడ్ స్టార్ కావడంతో కంబ్యాక్ తెలుగు హీరోతో కాకుండా జరుగుతోంది. మరి ఈ విషయంలో బుట్టబొమ్మ సంతోషమా? కాదా? అన్నది తేలాలి.
By: Srikanth Kontham | 2 Oct 2025 6:00 AM ISTపూజాహెగ్డే టాలీవుడ్ అవకాశాల్ని కాదని బాలీవుడ్ కు వెళ్లడం వైఫల్యం నేపథ్యంలో వెంటనే మళ్లీ కోలీవుడ్ కి కంబ్యాక్ అవ్వడం తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో మళ్లీ టాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. కానీ కాదని వెళ్లిన బ్యూటీని టాలీవుడ్ కూడా పక్కనబెట్టింది. టాలీవుడ్ లో ఉన్న పాత పరిచయాలు అన్నింటి తవ్వి తీసినా పనవ్వలేదు. అప్పటి నుంచి తమిళ్ లో వచ్చిన ఛాన్సులు వినియోగించుకోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయినా అవిశ్రామంగా తెలుగు అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
హీరో రికమండీషన్ తోనా:
ఉన్న ఏ మార్గాన్ని విడిచి పెట్టలేదు. మొత్తానికి అమ్మడి ప్రయత్నాలు నాలుగేళ్ల తర్వాత ఫలించినట్లే కనిపిస్తోంది. మాలీవుడ్ స్టార్ దుల్కార్ సల్మాన్ హీరోగా తెలుగులో నటిస్తోన్న 41వ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. నూతన దర్శకుడు రవి నేలకుదిటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. లవ్ అండ్ హ్యూమన్ డ్రామా కాన్సెప్ట్ ఇది. ఎస్ ఎల్ వీ సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాలో అవకాశం ఎలా సాధ్యమైంది? అంటే దుల్కర్ రిక మండీషన్ అనే మాట వినిపిస్తోంది. ఆయన కారణంగా దర్శక, నిర్మాతలు పూజాహెగ్డేని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కంబ్యాక్ లో లక్కీ హీరోయిన్:
అయితే దుల్కర్ మాలీవుడ్ స్టార్ కావడంతో కంబ్యాక్ తెలుగు హీరోతో కాకుండా జరుగుతోంది. మరి ఈ విషయంలో బుట్టబొమ్మ సంతోషమా? కాదా? అన్నది తేలాలి. ఏది ఏమైనా తెలుగులో కంబ్యాక్ అన్నది సంతోషాన్నిచ్చే విషయమే. నాలుగేళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో అవకాశం అంటే ఆషామాషీ కాదు. రాసిపెట్టి ఉన్న వాళ్లకే అలాంటి అవకాశాలు వస్తాయి. టాలీవుడ్ ఒక్కసారి పక్కన బెట్టిందంటే? తిరిగి ఛాన్స్ ఇవ్వడం అంత సులభం కాదు. అద్భుతాలు జరిగితే తప్ప పిలిచి ఛాన్స్ ఇవ్వదు. ఆ రకంగా చూసుకుంటే బుట్టబొమ్మ చాలా అదృ ష్టవంతురాలే.
వాళ్లతో పోటీ పడగలదా:
మరి కంబ్యాక్ తర్వాత మళ్లీ బిజీ నటిగా మారుతుందా? లేదా? అన్నది చూడాలి. అసలే హీరోయిన్ల మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. కొత్త కొత్త భామలు దిగుతున్నారు. అందులోనూ సౌత్ నుంచే పోటీ ఎక్కువగా ఉంది. టాలీవుడ్ మేకర్స్ ముంబై మోడల్స్ కన్నా? సౌత్ భామలకు పెద్ద పీట వేస్తున్నారు. సహజ అందానికి..నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ పోటీని తట్టుకుని పూజాహెగ్డే నిలబడాలి.
