పూజా అసలైన కంబ్యాక్ ఇదేనా?
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ఏవైనా వస్తే అందులో అందరి అటెన్షన్ హీరోలపైనే ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Nov 2025 10:26 AM ISTసాధారణంగా పెద్ద హీరోల సినిమాలు ఏవైనా వస్తే అందులో అందరి అటెన్షన్ హీరోలపైనే ఉంటుంది. అందులో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ నటించినా ముందుగా అందరూ చూసేది హీరోనే. కానీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ పై ఉండాల్సిన ఫోకస్ మొత్తాన్ని బుట్టబొమ్మ పూజా హెగ్డే తన వైపుకు తిప్పేసుకున్నారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? జన నాయగన్ మూవీలోని ఫస్ట్ సింగిల్ దళపతి కచేరి గురించి.
దళపతి కచేరి సక్సెస్ లో పూజాకు క్రెడిట్
ఈ సాంగ్ లో పూజా హెగ్డే సాంప్రదాయంగా చీరలో కనిపించడమే కాకుండా, విజయ్ ఎనర్జీని మ్యాచ్ చేయడంతో పాటూ శారీలో పూజా అద్భుతమైన లుక్స్, మంచి గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేశారు. దీంతో ఇప్పుడామె స్క్రీన్ ప్రెజెన్స్ పెద్ద చర్చనీయాంశంగా మారడంతో దళపతి కచేరి సాంగ్ సక్సెస్ కు పూజా క్రెడిట్ అందుకున్నారు.
మోనికా సాంగ్ తో అలరించిన పూజా
దాదాపు రెండు మూడేళ్ల గ్యాప్ తర్వాత పూజా కోలీవుడ్ కు కంబ్యాక్ ఇవ్వగా, సెకండ్ ఇన్నింగ్స్ లో పూజా చేసిన ప్రయత్నాలేవీ సక్సెస్ అవలేదు. రీసెంట్ గా సూర్య తో రెట్రో సినిమా చేసిన పూజా, ఆ మూవీతో మంచి కంబ్యాక్ ఇస్తుందనుకుంటే రెట్రో మూవీ ఫ్లాప్ గా నిలిచింది. రెట్రో ఫ్లాపైనా రజినీకాంత్ కూలీ మూవీలో మోనికా సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించి ఆ సాంగ్ ను చార్ట్‌బస్టర్ గా నిలిపారు.
సోషల్ మీడియాలో కొందరి నుంచి విమర్శలు
మోనికా సాంగ్ తో అందరినీ అలరించిన పూజా ఇప్పుడు దళపతి ఆఖరి సినిమాగా వస్తున్న జన నాయగన్ లో ఫీమేల్ లీడ్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ తో పూజా తన మార్క్ ను వేయగా, దళపతి సాంగ్ లో పూజా లుక్స్, డ్యాన్స్ మూవ్స్ హైలైట్ గా నిలిచాయి. ఈ సాంగ్ లో కెమెరాను పూజా నడుము, నాభి పైనే ఎక్కువగా ఫోకస్ చేసినందుకు సోషల్ మీడియాలో కొంతమంది మేకర్స్ ను విమర్శించినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఆ విజువల్స్ ను చూసి ఎంజాయ్ చేస్తూ, పూజా గ్లామర్ లుక్స్ ను అభినందిస్తున్నారు.
రిలీజైన గంటల్లోనే ట్రెండింగ్ లోకి
తన లుక్స్, డ్యాన్సులు, గ్లామర్ తో దళపతి కచేరి సాంగ్ ను రిలీజైన కొన్ని గంటల్లోనే వైరల్ చేసిన పూజా కు ఇది నిజమైన కంబ్యాక్ లాంటిదని ఆమె ఫ్యాన్స్ భావిస్తూ పూజాని ప్రశంసిస్తూ నాన్‌స్టాప్ గా హ్యాష్ ట్యాగులను ట్రెండ్ చేస్తున్నారు. ఈ కారణంతోనే పూజా ఇప్పటికీ సౌత్ ఇండియాలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అవుతుందని అందరూ అంటున్నారు. ఇక జననాయగన్ విషయానికొస్తే ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
