పూజాహెగ్డే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి..?
ఐతే తమిళ్ లో ఆల్రెడీ జన నాయగన్ లో నటిస్తున్న పూజా హెగ్దే నెక్స్ట్ కాంచనా 4లో కూడా ఉందని తెలుస్తుంది.
By: Ramesh Boddu | 3 Dec 2025 12:08 PM ISTబుట్ట బొమ్మ పూజా హెగ్దే సౌత్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. తమిళ్ లో కాస్త పర్వాలేదు కానీ తెలుగులో మాత్రం అమ్మడికి ఛాన్స్ లు లేక కాస్త ఇబ్బంది పడుతుంది. ప్రభాస్ తో రాధే శ్యాం చేసిన ఈ అమ్మడు నెక్స్ట్ మహేష్ గుంటూరు కారం లో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజార్చుకుంది. ఆ తర్వాత పూజా హెగ్దేకి తెలుగులో ఒక్క మూవీ కూడా పడలేదు. నాగ చైతన్య, నాని సినిమాల్లో ఛాన్స్ అంటూ వార్తలు రావడమే కానీ అందులో ఏ ఒక్కటి నిజం కాలేదు.
తెలుగులో ఛాన్స్ లు లేకుండా..
ఐతే తమిళ్ లో ఆల్రెడీ జన నాయగన్ లో నటిస్తున్న పూజా హెగ్దే నెక్స్ట్ కాంచనా 4లో కూడా ఉందని తెలుస్తుంది. ఇదే కాకుండా మరో సినిమా డిస్కషన్ లో ఉందట. హిందీలో కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తుంది పూజా బేబ్. ఎటొచ్చి అమ్మడికి తెలుగులోనే సరైన ఛాన్స్ లు లేకుండా అవుతున్నాయి. పూజా హెగ్దే దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాతో అమ్మడి కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెలుగు ఎంట్రీ ఇస్తుంది.
బుట్ట బొమ్మని తెలుగు మేకర్స్ ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నది తెలియదు కానీ ఆమె ఉంటే సినిమాలో గ్లామర్ షోకి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇక పూజా బేబీ ఫ్యాన్స్ కి కావాల్సినంత హాట్ స్టఫ్ ఇస్తుంది. కెరీర్ లో ఇప్పటివరకు గ్లామర్ పరంగా తన మార్క్ చూపిస్తూ వచ్చిన పూజా హెగ్దే ఇక మీదట గ్లామర్ ఒక్కటే కాదు తన యాక్టింగ్ టాలెంట్ కూడా చూపించాలని ఫిక్స్ అయ్యింది. అందుకే అమ్మడు ఈమధ్య సినిమాలను కూడా ఆచి తూచి సెలెక్ట్ చేస్తుంది.
దుల్కర్ సల్మాన్ తో పూజా హెగ్దే..
దుల్కర్ సల్మాన్ తో సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉన్నట్టే లెక్క. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సో అటు కోలీవుడ్ లో పూజా మేనియా కొనసాగించేందుకు కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తుంది. ఇదే కాదు టాలీవుడ్ స్టార్ సినిమాల్లో కూడా పూజా నటించాలని చూస్తుంది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ కి తను పరిచయమే కాబట్టి తెలుగు పాన్ ఇండియా సినిమాలు ఆఫర్ వస్తే చేయాలని ఆసక్తిగా ఉంది పూజా హెగ్దే. మరి ఆ ఛాన్స్ ఎవరిస్తారన్నది చూడాలి.
పూజా హెగ్దే హిందీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు అక్కడ సరైన లక్ కలిసి రావట్లేదు. అందుకే అమ్మడు సౌత్ సినిమాల మీదే తన ఫోకస్ పెడుతుంది. తెలుగులో ఒక్క స్టార్ మూవీ ఛాన్స్ వస్తే మళ్లీ తిరిగి కెరీర్ లో పట్టు సాధించాలని చూస్తుంది అమ్మడు.
