Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గట్లేదంతే..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేసింది.

By:  Ramesh Boddu   |   13 Nov 2025 9:44 AM IST
బుట్ట బొమ్మ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గట్లేదంతే..!
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేసింది. స్టార్ సినిమా అంటే చాలు పూజా హెగ్దే హీరోయిన్ అనుకునే రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే హిట్లు పడినన్నాళ్లు పర్లేదు కానీ ఫ్లాప్స్ పడితే మాత్రం అవకాశాలు రావు. దానికి పూజా హెగ్దే కూడా తలవంచక తప్పలేదు. రాధే శ్యామ్ తర్వాత పూజా హెగ్దేకి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా పడలేదు. మహేష్ గుంటూరు కారం సినిమా మధ్యలో నుంచి ఆమె ఎగ్జిట్ అయ్యింది. ఆ రీజన్ తో చేతిదాకా వచ్చిన కొన్ని ఛాన్స్ లు కూడా మిస్ అయ్యాయని తెలుస్తుంది.

పూజా హెగ్దే కోలీవుడ్ లో వరుస సినిమాలు..

అటు బాలీవుడ్ లో కూడా ఆశించిన విధంగా కెరీర్ లేదని తెలిసిందే. అందుకే తన ఫోకస్ అంతా కూడా తమిళ పరిశ్రమ మీద పెడుతుంది అమ్మడు. పూజా హెగ్దే కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అసలు తన తెరంగేట్రం చేసింది కూడా ఒక తమిళ్ సినిమాతోనే. మళ్లీ అమ్మడు ఇప్పుడు అదే తమిళ్ ఇండస్ట్రీలో బిజీ అవుతుంది. సూర్యతో రెట్రో వర్క్ అవుట్ కాకపోయినా కూడా పూజా హెగ్దేకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఆల్రెడీ దళపతి విజయ్ జన నాయగన్ లో అమ్మడు నటిస్తుంది. ఇదే కాకుండా కాంచనా 4లో పూజా హెగ్దే ఫిక్స్ అయ్యింది. మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా డిస్కషన్ లో ఉన్నాయట. మరోపక్క ఆఫ్టర్ లాంగ్ టైం లో దుల్కర్ సల్మాన్ తో రవి కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో పూజా హెగ్దే నటిస్తుంది. ఈ సినిమాను దసరా మేకర్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగులో చాలా గ్యాప్ తర్వాత పూజా హెగ్దే చేస్తున్న సినిమా ఇది అవ్వడం విశేషం.

పూజాని ఫాలో అవుతున్న తెలుగు ఆడియన్స్..

సినిమాలు చేయకపోయినా పూజాని తెలుగు ఆడియన్స్ తన సోషల్ మీడియాలో ఫాలో అవుతూ అభిమానిస్తున్నారు. పూజా బేబ్ మాత్రం మళ్లీ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి చూపిస్తుంది. ఎలాగు దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ గా వర్క్ అవుట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా పూజా హెగ్దేకి ఈ ఛాన్స్ ఆమె తిరిగి ఫాంలోకి వచ్చేలా చేస్తుందేమో చూడాలి.

ఇదే కాదు తెలుగులో కూడా పూజా హెగ్దే గురించి స్పెషల్ డిస్కషన్ నడుస్తుంది. ఆమె క్రేజ్ ఫాలోయింగ్ తెలుసు కాబట్టి యువ హీరోలు పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారు. అవకాశాలు తగ్గినా కూడా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో మాత్రం పూజా హెగ్దే తగ్గట్లేదట. రాబోతున్న తమిళ్ సినిమాలతో హిట్లు పడితే పూజా హెగ్దే మళ్లీ కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.