Begin typing your search above and press return to search.

అలాంటి ప్ర‌చారం కూడా ఇష్టం లేదా?

బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది.

By:  Srikanth Kontham   |   28 March 2026 8:00 PM IST
అలాంటి ప్ర‌చారం కూడా ఇష్టం లేదా?
X

బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిన భామ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి టాప్ పొజిషన్‌కు చేరుకుంది. అయితే తెలుగు సినిమాలను కాదని బాలీవుడ్ వైపు దృష్టి సారించడం ఆమె కెరీర్‌కు కొంత ప్రతిబంధకంగా మారింది. అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించకపోవడంతో మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్‌లో పాగా వేయడానికి కొంత కాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం పూజా హెగ్డేకు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం అవ‌కాశాలు రావ‌డం లేదు.

ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `ఆదర్శ కుటుంబం - హౌస్ నెంబర్ 47` చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం తలుపు తట్టిందని తెలిసింది. కానీ ఈ ఛాన్స్ ను అమ్మ‌డు సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. సాధారణంగా అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా ఇండస్ట్రీలో నిలబడాలని భావిస్తారు. కానీ పూజ మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిర‌స్క‌రించ‌డం చ‌ర్చ‌నీ యంశంగా మారింది. క‌నీసం ఐటం పాట అనే ప్ర‌చారం కూడా నెట్టింట రావ‌డం త‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోందిట‌.

కేవలం ఒక పాటకే పరిమితం కావడం తన ఇమేజ్‌కు సరిపడదని పూజ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమ్మ‌డు న‌టించిన `జిగిల్ రాణి` సాంగ్స్ పెద్ద హిట్ అయినప్పటికీ? సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం హీరోయిన్‌గానే సత్తా చాటాలని పట్టుదలతో క‌నిపిస్తోంది. ఐటెం సాంగ్స్ చేయడం వల్ల స్పెషల్ సాంగ్ గర్ల్ అనే ముద్ర పడితే, భవి ష్యత్తులో మెయిన్ లీడ్ రోల్స్ రావడం కష్టమని పూజాహెగ్డే దీర్ఘకాలిక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు

ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే కోలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేస్తోంది. దళ‌ప‌తి విజయ్ హీరోగా న‌టించిన `జ‌న నాయ‌గ‌న్` లో న‌టించింది. ఈ సినిమా విజ‌యం సాధిస్తే పూజ‌కు అక్క‌డ మెరుగైన అవ‌కాశాలు అందుకుంటుంది. `కాంచ‌న 4`లోనూ న‌టిస్తోంది. అలాగే హిందీలోనే ఓ సినిమా చేస్తోంది. మ‌ల‌యాళం స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఓ తెలుగు సినిమాలోనూ అవ‌కాశం అందుకుంది. న‌టిగా కొంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ తెలుగు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మాత్రం అమ్మ‌డి వైపు చూడ‌టం లేదు. ఇవ‌న్నీ గ్ర‌హించే తెలుగు సినిమాల విష‌యంలో అనవసరమైన తొందర పాటు నిర్ణయాలు తీసుకోకుండా సరైన సమయం కోసం వేచి చూడటమే ఉత్తమంగా భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.