Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఎరుపెక్కిన బుట్ట‌బొమ్మ వ‌య్యారం

`బుట్టబొమ్మ` పూజా హెగ్డే గ్లామర్, స్టైల్ కంటెంట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేటిత‌రంలో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు అందుకుంటున్న మేటి క‌థానాయిక‌.

By:  Sivaji Kontham   |   20 Aug 2026 9:10 AM IST
ఫోటో స్టోరి: ఎరుపెక్కిన బుట్ట‌బొమ్మ వ‌య్యారం
X

`బుట్టబొమ్మ` పూజా హెగ్డే గ్లామర్, స్టైల్ కంటెంట్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నేటిత‌రంలో జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు అందుకుంటున్న మేటి క‌థానాయిక‌. ఫ్యాష‌న్ సెన్స్ ప‌రంగాను అంద‌నంత ఎత్తులో ఉంది. తాజాగా ఈ బ్యూటీ ధరించిన ఎరుపు రంగు డిజైనర్ చీరలో త‌న‌ అందచందాలను వర్ణించడానికి కుర్ర‌కారు పోయెట్రీకి అల‌వాటు ప‌డుతున్నారు. బహుశా కాళిదాసే మళ్లీ పుట్టుకురావాలేమో అనిపించేలా ఆ అందం అంత‌గా యూత్ ని ఆక‌ర్షిస్తోంది. పూజ అందాన్ని వంద రెట్లు ఎలివేట్ చేయడానికే ఈ ప్రత్యేక డిజైనర్ డ్రెస్ ని రూపొందించారని ఎవరైనా అంగీకరించాల్సిందే. ఈ స్పెష‌ల్ రెడ్ హాట్ డిజైనర్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.




ఈ అద్భుతమైన గ్లామరస్ పోస్ట్‌కు వెనుక ఒక ప్రత్యేకమైన వేడుక కూడా ఉంది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో `పబ్లిక్ అడ్వొకేట్ ఫర్ ది సిటీ ఆఫ్ న్యూయార్క్` ద్వారా తనకు అరుదైన పురస్కారం- గౌరవం దక్కిన సందర్భంలో పూజా హెగ్డే ఈ రెడ్ శారీ లుక్‌లో మెరిసారు. ఈ అవార్డు అందుకోవడంపై తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ.. లభించిన గౌరవానికి వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. ఇకపై మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతానని పూజా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్ చేశారు.




న్యూయార్క్ గాలా వేడుకలో తీసిన ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమవ్వగానే లైకులు, కామెంట్ల వర్షం కురిసింది. పూజ తల్లి లతా హెగ్డే ఈ పోస్ట్‌పై స్పందిస్తూ ``నీ గురించి చాలా గర్వంగా ఉంది డార్లింగ్`` అంటూ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, రచయితలు, పరిశ్రమ వర్గాలు బుట్ట‌బొమ్మ‌ సాధించిన విజయాన్ని అభినందిస్తూ.. ఆ ఎరుపు రంగు చీరలో ఎలిగెంట్ లుక్స్ - స్టైల్‌ను విపరీతంగా ప్రశంసించారు.




సాధారణ నెటిజన్లు, అభిమానులు అయితే బుట్టబొమ్మ రాయల్ లుక్‌కి పూర్తిగా ఫిదా అయిపోయారు. ``న్యూయార్క్‌లో ఎరుపు రంగు సొగసు`` అంటూ కామెంట్లు పెడుతూ తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఒక్కో ఫోటోలో ఒక్కో విధమైన సౌందర్యం ఉట్టిపడుతోందని.. త‌న‌ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

గ్లోబల్ వేదికపై భారతదేశ గ్లామర్‌ను, నటప్ర‌తిభ‌ను ఆవిష్క‌రిస్తూ పూజా హెగ్డే సాధిస్తున్న ఈ విజయాలు త‌న‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ స్థాయి గౌరవాలు.. మరోవైపు నెటిజన్లను కట్టిపడేసే హాట్ లుక్స్‌తో బుట్టబొమ్మ కుర్రకారు కలల రాణిగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ఇటీవ‌ల యూరఫ్ ప‌ర్య‌ట‌న ముగించిన పూజా త‌దుప‌రి సినిమాల‌పై దృష్టి సారించ‌నుంది. పూజా న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ ఇటీవ‌లే విడుద‌లై ఘ‌న‌ విజ‌యం సాధించిన‌ సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి హార‌ర్ మూవీ కాంచ‌న 4 లో న‌టిస్తోంది. అలాగే శ్రీ‌శ్రీ అనే మ‌రో చిత్రంలోను న‌టిస్తూ బిజీగా ఉంది.