Begin typing your search above and press return to search.

వాళ్లంతా ఫేక్.. నా ఆందోళన టికెట్ కొనేవాళ్ల కోసమే : పూజ హెగ్డే

ఇక తాజాగా రజనీకాంత్ కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. అయితే పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

By:  M Prashanth   |   12 Aug 2025 4:25 PM IST
వాళ్లంతా ఫేక్.. నా ఆందోళన టికెట్ కొనేవాళ్ల కోసమే : పూజ హెగ్డే
X

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కొన్ని రోజులుగా పెద్ద సినిమాలేవీ లేవు. చాలా రోజుల తర్వాత ఆమె రీసెంట్ గా సూర్య రెట్రో సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. ఇక తాజాగా రజనీకాంత్ కూలీ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. అయితే పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మెనికా అనే పాటలో పూజా లుక్స్, ఆమె డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇప్పటికే లక్షల వ్యూస్ తో యూట్యూబ్ లో పాట ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. కూలీ ప్రమోషన్స్ కు ఒక రకంగా పూజా హెగ్డే మోనికా పాట కూడా ఒక కారణం. అయితే ఈ పాట సినిమాలో ఉండదని చెప్పి మేకర్స్ ఆడియెన్స్ కు షాకిచ్చారు. ఈ పాటను కేవలం బిజినెస్ పర్పస్ కోసమే చేశామని.. ఇది సినిమాలో ఉండదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.

దీంతో సోషల్ మీడియాలో పూజ గురించి ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. ఈ టోల్స్ పై పూజ స్పందించింది. సోషల్ మీడియా అనేది అంతా ఫేక్ అని కొట్టిపారేసింది. తాజా ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది. నేను ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే, నాతో ఫొటో కోసం ఎందరో అభిమానులు దగ్గరికి వస్తారు. అప్పుడు అర్థమైంది సోషల్ మీడియా అనేది నిజం కాదని. వాళ్ల పేర్లు ఫేమస్ అవ్వడం కోసమో, లేదా పోస్ట్ చేయడానికి ఏమీ లేకనో ట్రోల్స్ చేస్తుంటారు.

ఇలా సోషల్ మీడియాలో పోస్టులు టికెట్లుగా మారవు. అంటే వాళ్లంతా టికెట్ కొనుక్కొని సినిమాకు రారు. అందుకే ఎవరైతే టికెట్ కొని సినిమాకు వస్తారో, ఆ ఆడియెన్స్ గురించి నేను ఆందోళన చెందాలి. వీళ్ల గురించి కాదు. నాకు లోకేశ్ ముందే చెప్పారు. మోనికా సాంగ్ కేవలం బిజినెస్ ప్రమోషన్స్ కోసమే అని. నా వళ్ల సినిమాకు వ్యాల్యు పెరుగుతుందని నేను కూడా సంతోషించాను. అని పూజ పేర్కొంది. అయితే ఈ పాట ఒప్పుకున్నప్పుడే.. ఇది సూపర్ సక్సెస్ అవుతుందని పూజ కాన్ఫిండెంట్ గా ఉందని చెప్పింది .

కాగా, లోకేశ్ కనగరాజ్ తెరెకక్కించిన ఈ సినిమాలో రజనీ కాంత్ హీరోగా నటించారు. అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.