రెబల్ స్టార్ కోసం ఏదైనా చేస్తా - హీరోయిన్
అయితే ఇప్పుడు ఆయన కోసం మరో హీరోయిన్ ఏం చేయడానికి అయినా సిద్ధమంటూ చెబుతోంది? ఆమె ఎవరో కాదు ప్రముఖ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే.
By: Madhu Reddy | 13 Aug 2025 11:23 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక్క అవకాశం రావాలి అని ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కోసం మరో హీరోయిన్ ఏం చేయడానికి అయినా సిద్ధమంటూ చెబుతోంది? ఆమె ఎవరో కాదు ప్రముఖ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే.
ఈ మధ్యకాలంలో వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతోంది కానీ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అవకాశాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె ఒకప్పుడు బలవంతంగా నటించిన ప్రభాస్ తో .. ఇప్పుడు మళ్లీ నటించడానికి ఏదైనా చేస్తానంటోంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే.. "ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో బాహుబలి-3 మూవీలో నటించే అవకాశం వస్తే.. కచ్చితంగా చేస్తాను. అంతేకాదు ప్రభాస్ సినిమాలో నటించడానికి ఏ ప్రయత్నం అయినా చేస్తాను.ఆయనతో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
అయితే పూజా హెగ్డే చేసిన ఈ కామెంట్లు ప్రభాస్ అభిమానులకు నచ్చడం లేదు.దానికి కారణం ఆ మధ్యకాలంలో పూజా హెగ్డే మీద వచ్చిన రూమర్లే. అదేంటంటే పూజా హెగ్డే ప్రభాస్ కాంబినేషన్లో ఇప్పటికే రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయింది. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన రాధే శ్యామ్ మూవీకి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేదు.
అయితే ఈ సినిమాలో నటించిన ప్రభాస్ మీద నమ్మకం పెట్టుకొని చాలామంది ఆయన అభిమానులు అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకొని మరీ సినిమా చూశారు. అలా మొదటి రోజు ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ సినిమా చూసిన ప్రేక్షకులకు కథ అస్సలు నచ్చలేదు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం పూజా హెగ్డే అనే టాక్ కూడా వినిపించింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్లో పూజ హెగ్డే ప్రభాస్ తో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు వంటి వాటిల్లో నటించడానికి అస్సలు ఆసక్తి చూపలేదని, అలాగే ప్రభాస్ ని,చిత్ర యూనిట్ ని వెయిట్ చేయిస్తూ తనకి ఇష్టం వచ్చినప్పుడు సినిమా షూటింగ్ కి వచ్చిందనే ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరికీ సినిమా షూటింగ్ సమయంలో చిన్నపాటి గొడవ కూడా జరిగిందని, అందుకే ప్రమోషన్స్ లో వీరిద్దరి మధ్య సఖ్యత లేనట్లుగా కనిపించారంటూ వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడగగా అలాంటిదేమీ లేదు మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదని చెప్పినప్పటికీ పూజ హెగ్డే ప్రవర్తనతో ప్రభాస్ విసిగిపోయాడనే టాక్ ఈ సినిమా టైంలో వినిపించింది.అయితే తాజాగా పూజ హెగ్డే బాహుబలి 3 లో అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని చెప్పడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు సినిమా అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని టార్చర్ చేసి ఇబ్బంది పెట్టావు.. ఇప్పుడు ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి ప్రభాస్ మీద పడుతున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
