వీడియో: పియానో వాయిస్తూ.. బుట్టబొమ్మలోని కొత్త కోణం
తెలుగు లోగిళ్లకు `బుట్టబొమ్మ`గా సుపరిచితమైన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల తనలోని సరికొత్త కళాత్మక కోణాన్ని ఆవిష్కరించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
By: Sivaji Kontham | 4 Aug 2026 12:08 AM ISTతెలుగు లోగిళ్లకు `బుట్టబొమ్మ`గా సుపరిచితమైన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల తనలోని సరికొత్త కళాత్మక కోణాన్ని ఆవిష్కరించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. నిరంతరం సినిమాలు, గ్లామరస్ ఫోటోషూట్‌లతో బిజీగా ఉండే ఈ భామ.. తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక క్యూట్ అండ్ స్పెషల్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. కేవలం నటనలోనే కాకుండా సంగీతంలోనూ తనకున్న ప్రతిభను చూపేందుకు పియానో వాయిద్య ప్రదర్శనతో పూజా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన పాపులర్ మ్యూజికల్ డ్రామా `లా లా ల్యాండ్`. ఈ చిత్రంలోని ఐకానిక్ మేలడీ ట్యూన్ `మియా అండ్ సెబాస్టియన్ థీమ్` ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. గత కొద్దిరోజులుగా ఈ ధున్ తన మనసును బాగా వెంటాడుతోందని.. అందుకే స్వయంగా దీన్ని ఎలా ప్లే చేయాలో నేర్చుకుని.. కీబోర్డ్ -పియానోపై ప్లే చేశానని పూజా హెగ్డే వెల్లడించారు. ఎంతో ఏకాగ్రతతో, ఎంతో నైపుణ్యంతో ఆ నోట్స్ ప్లే చేస్తుంటే నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఈ మ్యూజికల్ వీడియోకు పూజా హెగ్డే జోడించిన సరదా క్యాప్షన్ మరింత హంగామా సృష్టిస్తోంది. ``గత కొన్ని రోజులుగా ఈ ట్యూన్ నన్ను వెంటాడుతోంది. ఎలాగైతేనేం దీన్ని ప్లే చేయడం నేర్చుకున్నాను. ఇక ఇప్పుడు హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ ఇక్కడికి రావడమే ఆలస్యం!`` అంటూ చమత్కారంగా శీర్షిక రాసుకొచ్చారు. `లా లా ల్యాండ్` చిత్రంలో ర్యాన్ గోస్లింగ్ పియానో ప్లేయర్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలోని మూడ్‌కు అనుగుణంగా పూజా సరదా వ్యాఖ్య అభిమానులను ఎంతగానో అకట్టుకుంది.
ఈ వీడియోలో పూజా హెగ్డే వాయించిన పియానో ట్యూన్‌తో పాటు తన లుక్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయబద్ధమైన చీరకట్టు- షార్ట్ హెయిర్ స్టైల్‌తో ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తూ నెటిజన్ల మనసులను దోచుకున్నారు. పూజాలోని సంప్రదాయం, ఆధునిక భావాలు కలగలిసి కనిపించడంతో ఈ వీడియోకు లక్షలాది లైక్స్ - వ్యూస్ లభిస్తున్నాయి. అభిమానులు ఈ రూపంలో పూజాను చూసి మురిసిపోతున్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్‌పై ఫ్యాన్స్ సహా సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. `లా లా ల్యాండ్` సినిమాలో నటి ఎమా స్టోన్ చేసిన మియా పాత్రలాగే మీరు ఎంతో అందంగా ఉన్నారు.. పూజా హెగ్డే కీబోర్డ్ ప్లే చేయడం.. మధ్యలో ఆమె చిందించిన చిరునవ్వు నిజంగా అద్భుతం! అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక కథానాయికగా గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా... ఇలాంటి విభిన్నమైన నైపుణ్యాలను బయటపెడుతూ బుట్టబొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది. పూజా నటించిన జననాయగన్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తదుపరి వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
