Begin typing your search above and press return to search.

మొత్తానికి ప్ర‌భాస్ గురించి బుట్ట‌బొమ్మ ఓపెన్ అయింది!

డార్లింగ్ ప్ర‌భాస్ తో ప‌ని చేసిన హీరోయిన్లు అంతా అత‌డు ఇంటి పుడ్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుతుంటారు.

By:  Srikanth Kontham   |   5 Jan 2026 9:00 PM IST
మొత్తానికి ప్ర‌భాస్ గురించి బుట్ట‌బొమ్మ  ఓపెన్ అయింది!
X

డార్లింగ్ ప్ర‌భాస్ తో ప‌ని చేసిన హీరోయిన్లు అంతా అత‌డు ఇంటి పుడ్ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుతుంటారు. ప్ర‌భాస్ సినిమాలో హీరోయిన్ అంటే? ప్ర‌త్యేకంగా వారు లంచ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. డార్లింగ్ ఇంటి నుంచే పుడ్ వ‌చ్చేస్తుంది. ర‌క‌ర‌కాల నాన్ వెజ్ తో పాటు కావాల్సిన‌న్ని వెజ్ వంట‌కాలు సెట్ లో ఘుమ ఘుమ‌లాడుతాయి. ప్ర‌భాస్ తో ప‌నిచేసిన హీరోయిన్లు అంతా అత‌డి ఇంట టేస్టీ ఫుడ్ గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. హీరోయిన్ల‌కు క‌డుపునిండా తినిపించి విసుగు పుట్టించ‌డం డార్లింగ్ ప్ర‌త్యేక‌త‌. అందుకే ఆ సినిమా సెట్స్ అనుభ‌వాల‌ను ఏ హీరోయిన్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోదు.

రిలీజ్ స‌మ‌యంలో ఆ అనుభ‌వాల‌న్నింటినీ త‌ప్ప‌క పంచుకుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భాస్ తో ప‌నిచేసిన హీరోయిన్లు అంతా త‌మ అనుభ‌వాన్ని పంచుకున్నారు. కానీ ముంబై బ్యూటీ పూజాహెగ్డే మాత్రం ప్ర‌భాస్ ఇంట పుడ్ గురించి ఎక్క‌డా స్పందించలేదు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `రాధేశ్యామ్` చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారంలో ఇద్ద‌రు క‌లిసి పాల్గొన్నారు. కానీ ఎడ ముఖం..పెడ ముఖంగా క‌నిపించారు. ఆ చిత్ర యూనిట్ తో విబేధాలు కార‌ణంగా ఈ ర‌క‌మైన ప‌రిస్థితులు త‌లెత్తిన‌ట్లు అప్ప‌ట్లో మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది.

ఈ కార‌ణంగానే ప్ర‌భాస్ ఇంట పుడ్ గురించి పూజాహెగ్డే ఎక్క‌డా ఓపెన్ అవ్వ‌లేదు. దీంతో పూజాహెగ్గే ఆ ఛాన్స్ మిస్ అయిందా? అందుకే స్పందించ‌లేదా? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ అలాంటిదేది లేద‌ని తేలిపోయింది. తాజాగా ఓ మీట్ లో పూజాహెగ్డే డార్లింగ్ గురించి మాట్లాడింది. `రాధేశ్యామ్` త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మైన చిత్ర‌మంది. `ప్ర‌భాస్ సిగ్గ‌రి. కానీ ప‌రిచ‌య‌మైతే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా స‌ర‌దాగా ఉంటారు. అలాంటి వాళ్లు చాలా త‌క్కువ మంది ఉంటారు. కోవిడ్ స‌మ‌యంలో నా స‌హాయ‌కులు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

దీంతో రోజు ప్ర‌భాస్ ఇంటి నుంచే భోజ‌నం వ‌చ్చేది. సెట్స్ లో ఉన్నంత కాలం ఆయ‌న ఇంటి భోజ‌న‌మే తినేదాన్ని. ఆ వంట‌ల‌కు నాతో పాటు మా అమ్మ కూడా ఫిదా అయింది. ఎన్నో ర‌కాల నాన్ వెజ్ వంట‌కాలు పంపించేవారు .వా టి వాస‌నే ఎంతో ప్ర‌త్యేకంగా ఉండేది. `బాహుబ‌లి 3`లో అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగితే? తెలివిగా రాజ‌మౌళి పేరు చెప్పి త‌ప్పించుకున్నారు. ప్ర‌భాస్ స్వీట్ గ‌య్ అంటూ న్వేసింది. ప్ర‌స్తుతం పూజాహెగ్డే మ‌ళ్లీ టాలీవుడ్ లో అవకాశాల కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే దుల్కార్ స‌ల్మాన్ 41వ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. తెలుగు స్టార్స్ స‌ర‌స‌న అవకాశాలు అందుకోవాల‌న్న‌ది బుట్ట‌బొమ్మ ప్లాన్.