బాలయ్య కోసం జిగిల్ రాణినే దించుతున్నారా?
నటసింహ బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 29 March 2026 11:45 AM ISTనటసింహ బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `వీరసింహారెడ్డి` వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరి కలయికలో రూపొందుతున్న మరో మాస్ చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఇందులో ఓ హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంపికైంది. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో కొన్ని హిట్ సినిమాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాంబో ఫెయిలవ్వదనే సెంటిమెంట్ కూడా సినిమాకు కలిసొస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మరో నాయికగా పూజాహెగ్డే పేరును పరిశీలిస్తున్నట్లు చర్చకొచ్చింది.
అదే నిజమైతే పూజాహెగ్డే కల సాధ్యమైనట్టే. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో బలమైన కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ కంబ్యాక్ అనంతరం చేతిలో తమిళం మరియు హిందీలో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పటికీ టాలీవుడ్‌లో మళ్ళీ తన మార్కు చూపే ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తోంది. కానీ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దర్శక, నిర్మాతలు అమ్మడిని లైట్ తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్లగా తెలుగు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నా? ఫలించడం లేదు. ఈ క్రమంలోనే బాలయ్య - గోపీచంద్ మలినేని ప్రాజెక్టు కోసం అమ్మడి పేరు పరిశీలనకు రావడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవలే ఓ తెలుగు చిత్రంలో ఐటం సాంగ్ లో నటిస్తుందనే ప్రచారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో వాటిని అమ్మడు వెంటనే ఖండించింది. హీరోయిన్ పాత్రలు తప్ప మళ్లీ ఐటం పాటల్లో నటించేది లేదు అన్నట్లు వ్యాఖ్యానించింది. అంతలోనే బాలయ్య సరసన ఛాన్స్ అంటూ వార్తలు రావడం ఆసక్తికరం. మరి తుదిగా అమ్మడు ఎంపిక అవు తుందా? లేదా? అన్నది చూడాలి. ఇప్పటికే పూజాహెగ్డే వయసు కూడా 35 దాటేసింది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలకు అమ్మడు పర్పెక్ట్ ఛాయిస్ అవుతుంది. బాలయ్య తో ఛాన్స్ కన్పమ్ చేసుకుంటే మిగతా సీనియర్లు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది.
మురుగున పడిన భామలకు లిప్ట్ ఇవ్వడం బాలయ్యకు అలవాటే. గతంలో ప్రగ్యా జైశ్వాల్, సోనాల్ చౌహాన్ ని అలాగే అవకాశాలు కల్పించారు. కానీ నిలదొక్కుకోవడంలో ఇద్దరు ఫెయిలయ్యారు. మరి పూజాహెగ్డేకు బాలయ్య ఛాన్స్ నిజమే అయితే? అమ్మడి పంట పడినట్లే. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి కాబట్టి పూజ సక్సెస్ కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఓ తెలుగు సినిమాలో బుట్టబొమ్మ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
