Begin typing your search above and press return to search.

నాని పక్కన పూజా హెగ్డే.. సూట్ అవుతుందా?

అసలు విషయంలోకి వెళ్తే.. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది పూజా హెగ్డే.

By:  Madhu Reddy   |   20 Oct 2025 10:06 AM IST
నాని పక్కన పూజా హెగ్డే.. సూట్ అవుతుందా?
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో బుట్టబొమ్మగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం నాని, సుజీత్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తున్న వేళ ఇండస్ట్రీలో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. అసలు నాని పక్కన పూజా హెగ్డే సూట్ అవుతుందా? అంటూ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది పూజా హెగ్డే. వరుస అవకాశాలు తలుపు తట్టడంతో కథల ఎంపిక విషయంలో కాస్త తడపబడింది. చివరిగా ఆచార్య సినిమాలో కనిపించిన ఈమె.. వరుస డిజాస్టర్లు ఎదురవడంతో మళ్లీ తెలుగు చిత్రాలలో కనిపించలేదు. దీనికి తోడు ఇటీవల లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో మోనిక అంటూ స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది కానీ ఒక రేంజ్ లో అయితే ఈమెకు గుర్తింపు లభించలేదు అనే చెప్పాలి.

ప్రస్తుతం టాలీవుడ్ లో రవి నెలకుడిటి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న చిత్రానికి సంతకం చేసింది.

దీనికి తోడు ఇప్పుడు #NaniXSujeeth అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న చిత్రంలో కూడా ఇప్పుడు ఈమెను హీరోయిన్గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సుజిత్ ట్రేడ్ మార్క్ తో కూడిన స్టైలిష్, యాక్షన్, కామెడీ మూవీ గా ఈ చిత్రం రాబోతోంది. అటు ప్రస్తుతం నాని .. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సుజిత్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఆలోచిస్తున్నారట. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నాని ఎప్పుడూ కూడా తన పక్కన హీరోయిన్లను పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్స్ ని ఎంచుకుంటాడు. ఉదాహరణకు సాయి పల్లవి, నజ్రియా నజీమ్, కీర్తి సురేష్, ప్రియాంక మోహన్, నివేద థామ్సన్ వంటి హీరోయిన్స్ ను , తన స్క్రీన్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే వారినే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. దీనికి తోడు సహజ నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నాని ఎప్పుడు కూడా చాలా సింపుల్ గా నేచురల్ గా ఉండేలా చూసుకుంటాడు

అటు పూజా హెగ్డే అల్లు అర్జున్ , ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలకు బాగా సెట్ అవుతుంది. గ్లామర్ బ్యూటీగా కూడా పేరు సొంతం చేసుకుంది. ఇలాంటి రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులను మిళితం చేస్తే అసలు ఈ కాంబో సెట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం రూమర్ గానే వినిపిస్తోంది .కానీ దీనిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మాత్రం తెరకు ఒక రిఫ్రెషింగ్ ను జోడిస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి చూద్దాం ఈ కాంబో సెట్ అవుతుందో లేదో.