Begin typing your search above and press return to search.

ఈ సీజ‌న్‌లో పూజా- మృణాల్‌ల‌కు అగ్నిపరీక్ష

సినిమా పరిశ్రమలో అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం తోడు లేకపోతే మనుగడ సాగించడం కష్టం. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది.

By:  Sivaji Kontham   |   30 April 2026 9:34 AM IST
ఈ సీజ‌న్‌లో పూజా- మృణాల్‌ల‌కు అగ్నిపరీక్ష
X

సినిమా పరిశ్రమలో అందం, అభినయం ఎంత ఉన్నా.. అదృష్టం తోడు లేకపోతే మనుగడ సాగించడం కష్టం. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. దక్షిణాదిన అగ్ర కథానాయికలుగా వెలిగి.. కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్న ఈ ఇద్దరు సుందరీమణులు.. బాలీవుడ్ లో మాత్రం పాగా వేయలేకపోతున్నారు. హిందీలో వీరు చేసిన గత చిత్రాలు వరుసగా నిరాశపరచడంతో.. ఐపీఎల్ సీజన్ తర్వాత రాబోతున్న సినిమాపైనే వీరు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

వరుణ్ ధావన్ కథానాయకుడిగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై` చిత్రం ఈ ఇద్దరు భామల కెరీర్‌కు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. హీరో వరుణ్‌ కంటే కూడా హీరోయిన్లు పూజా, మృణాల్‌లకే ఈ సినిమా విజయం అత్య‌వ‌స‌రం అని చెప్పాలి. బాలీవుడ్‌లో ప్రస్తుతం వీరిద్దరూ ఒక రకమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిభ ఉన్నా.. గ్లామర్ విందులో దూకుడున్నా.. బాక్సాఫీస్ వద్ద అదృష్టం పలకరించ‌క‌ పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ముఖ్యంగా `1బుట్టబొమ్మ` పూజా హెగ్డే విషయానికి వస్తే..తెలుగులో తను అందుకున్న విజయాలు హిందీలో ఏమాత్రం పునరావృతం కావడం లేదు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్నా కానీ.. బాలీవుడ్ మార్కెట్ త‌న‌ను ఒక ఫ్లాప్ క్వీన్ గా ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టాలంటే ధావ‌న్‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. లేదంటే ఉత్తరాది అవకాశాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది.

మరోవైపు మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో మాత్రం హిట్టిచ్చే దేవుడి కోసం వేచి చూస్తోంది. అక్కడ మృణాల్ నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో త‌న‌ను ఐరెన్ లెగ్ గా చూస్తున్నారు. ఈ ఫ్లాప్ స్ట్రీక్‌కు బ్రేక్ వేయడానికి `హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హై` సినిమా ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది.

అదృష్టవశాత్తూ.. యశ్ నటించిన `టాక్సిక్` వాయిదా పడటంతో 5 జూన్ 2026న ఈ చిత్రానికి సోలో రిలీజ్ దక్కింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే థియేటర్లలోకి వచ్చే మొదటి భారీ సినిమా కావడంతో ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి `టాక్సిక్` తప్పుకోవడంతో దక్కిన ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వాడుకుని.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ జాతకాలను మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.