ఇటాలియన్ మోనికాకు చేరిన కూలీ మోనికా పాట
అయితే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ పాటను ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్ గా రూపొందించారు.
By: M Prashanth | 12 Aug 2025 11:00 PM ISTస్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా మోనికా సాంగ్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ అయిన మోనికా లో పూజ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ పాట రిలీజ్ అయిన నాటి నుండి ఫుల్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఒకరకంగా కూలీ సినిమాకు ఈ పాట కూడా హైప్ క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ పాటను ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్ గా రూపొందించారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కు కూడా ఆమెకు ఓ అభిమానియే. అందుకే వీళ్లు కూలీ సినిమా ప్రమోషన్స్ కోసం మోనికా పాటను పెట్టారు. దీనికి పూజా హెగ్డే, కొరియోగ్రాఫర్, అనిరుధ్ అందరూ వంద శాతం ఎఫోర్ట్ పెట్టి క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చారు. దీంతో పాట సూపర్ గా వచ్చింది.
తాజాగా ఈ పాటపై ఏకంగా మోనికా బెలూచి దాకా చేరింది. ఈ పాట ఆమెకు కూడా నచ్చిందట. ఈ విషయాన్ని బాలీవుడ్ లో ప్రముఖ విలేకరి అనుపమ చోప్రా వెల్లడించారు. ఈ పాట మోనికా దగ్గరకు చేరడంలోనూ అనుపమే కీలక పాత్ర పోషించారు. అదెలాగంటే... మోనికాకు తెలిసిన ఓ ఫిలిం ఫెస్టివల్ హెడ్ కు అనుపమ చోప్రా ఈ పాటను పంపించార. ఆ వ్యక్తి, ఈ పాటను మోనికాకు షేర్ చేశారట. అలా కూలీ లోని మోనికా పాట.. ఇటాలియన్ బ్యూటీ మోనికాకు చేరిందిన్నమాట. అయితే ఆమెకు ఈ పాట బాగా నచ్చిందట.
కాగా, పూజా హెగ్డేతో అనుమప తాజాగా చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది విన్న పూజ షాక్ తో, ఎంతో ఎగ్జైట్ అయ్యింది. మోనికా అంటే తనకే కాదు తన టీమ్ అందరికి కూడా చాలా ఇష్టమని, చెప్పింది. ఆమె మీద ఉన్న అభిమానంతోనే చేసిన ఈ పాట చివరకు మోనికాకు చేరడం పట్ల పూజా ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ పాట విడుదలయ్యాక.. అనేక మంది నెటిజన్లు మోనికా బెలూచిని ట్యాగ్ చేశారని, కూలీ సినిమా చూడాలని అడిగారని పూజా గుర్తు చేసుకుంది.
అయితే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఫుల్ హిట్ అయ్యింది. కానీ, ఈ పాట సినిమాలో ఉండదని, ఇది కేవలం బిజినెస్ పర్పస్ కోసమే చేశామని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. కాగా రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
