జలకన్యలా మారిన స్టార్ బ్యూటీ..
ఈమధ్య కాలంలో హీరోయిన్స్ సినిమాలలో హీరోయిన్లుగా నటించడమే కాకుండా అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 15 Nov 2025 8:24 PM ISTఈమధ్య కాలంలో హీరోయిన్స్ సినిమాలలో హీరోయిన్లుగా నటించడమే కాకుండా అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఆదాయాన్ని కూడా దక్కించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో అటు ఫాలోవర్స్ ను సొంతం చేసుకొని వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న బ్యూటీలకు మ్యాగజైన్ పై మెరిసే అవకాశం కూడా లభిస్తోంది. తమ గ్లామర్ లుక్ తో కట్టిపడేస్తున్న హీరోయిన్స్ ను మ్యాగజైన్స్ తమ కవర్ పేజీపై స్పెషల్ గా చూపిస్తూ వారికంటూ ఒక గౌరవాన్ని అందిస్తున్నారు.
ఇలా మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ హీరోయిన్లు తళుక్కుమని మెరవడమే కాకుండా.. వీటి ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటున్నారు. ఇకపోతే ఈ హీరోయిన్స్ మ్యాగజైన్స్ కవర్ పేజీపై ఇచ్చే ఫోజులు ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా వీరి అందానికి ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం భిన్న విభిన్నమైన ఫోజులిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే.. బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న ఈమె తాజాగా జలకన్యలా మారి అందరినీ అబ్బురపరుస్తోంది.
ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ లో జలకన్యలా కనిపించిన ఈమె.. మరో కొన్ని ఫోటోలలో ముత్యాలు, గవ్వలతో అందంగా డిజైన్ చేసిన డ్రెస్ ధరించి బీచ్ ఒడ్డున అందాలతో ఆశ్చర్యపరిచింది. ఇంకొక ఫోటోలో రెక్కలు కలిగిన దేవకన్యలా తన అందంతో ఆకట్టుకుంది. మొత్తానికి అయితే ఒక ట్రావెల్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పూజా హెగ్డే ఇచ్చిన ఫోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ ఫోటోలను travelandleisureindia అనే మ్యాగజైన్ షేర్ చేస్తూ.. పూజా హెగ్డే షేర్ చేసుకున్న అభిప్రాయాన్ని కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.
travelandleisureindia.. "నేను నిజంగా ఎలా ఉన్నానో అందులో ఎక్కువ భాగం నా ప్రయాణం అనుభవాల వల్లే ఇలా ఉన్నాను అనిపిస్తుంది. ప్రయాణం అనేది మనల్ని విభిన్న సంస్కృతులు, ప్రపంచాలకు పరిచయం చేస్తుంది. ప్రకృతితో కనెక్ట్ అవ్వడం వల్ల నాకు మరింత ప్రశాంతత కలుగుతుంది. విభిన్నమైన వ్యక్తులను చూడడం, కలవడం వల్ల మనం ఉన్న ప్రపంచంతో పోలిస్తే.. బయట ప్రపంచం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రయాణం నాకు ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. తరచుగా ప్రయాణం మనల్ని మనకు అనుగుణంగా మార్చుకునేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రపంచంలో సొంత వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కూడా ఈ ప్రయాణం సహాయపడుతుంది" అంటూ తన అభిప్రాయాన్ని పంచుకొచ్చింది. ప్రస్తుతం పూజ హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
ఒక పూజా హెగ్డే విషయానికి వస్తే.. ఇటీవలే రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో మౌనిక అంటూ స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకున్న ఈమె.. మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
