కోలీవుడ్ లో కూడా బ్యాడ్ లక్ స్టార్ట్..!
ఐతే ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్దే అవకాశం అందుకుందని టాక్. ధనుష్ తో రాజ్ కుమార్ పెరియసామి చేయబోతున్న సినిమాలో ముందు పూజా హెగ్దేనే హీరోయిన్ గా అనుకున్నారట.
By: Ramesh Boddu | 7 Dec 2025 3:00 PM ISTబుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడ ఆమెను అసలు పట్టించుకోవట్లేదు. ఐతే కోలీవుడ్ లో కాస్త పర్వాలేదు అన్నట్టు పరిస్థితి మొన్నటిదాకా కనిపించగా ఇప్పుడు అక్కడ కూడా అమ్మడికి బ్యాడ్ లక్ మొదలైంది అన్నట్టుగానే ఉంది. తమిళ్ లో సూర్యతో రెట్రో చేసిన పూజా హెగ్దే ప్రస్తుతం దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు లారెన్స్ చేస్తున్న కాంచన 4లో ఆమె ఛాన్స్ అందుకుంది.
ధనుష్ తో రాజ్ కుమార్ పెరియసామి..
ఐతే ధనుష్ నెక్స్ట్ సినిమాలో కూడా పూజా హెగ్దే అవకాశం అందుకుందని టాక్. ధనుష్ తో రాజ్ కుమార్ పెరియసామి చేయబోతున్న సినిమాలో ముందు పూజా హెగ్దేనే హీరోయిన్ గా అనుకున్నారట. ఐతే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో సాయి పల్లవినే ఫైనల్ చేశారని తెలుస్తుంది. ముందు సినిమాలో సాయి పల్లవినే తీసుకోవాలని అనుకోగా ఆమె బాలీవుడ్ రామాయణ్ లో నటిస్తుంది కాబట్టి డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా లేదా అన్న డౌట్ ఉండేదట. కానీ ఆల్రెడీ తనకు అమరన్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి ధనుష్ సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పిందని తెలుస్తుంది.
ధనుష్ తో ఆల్రెడీ మారీ 2 లో నటించింది సాయి పల్లవి. రౌడీ బేబీ సాంగ్ తో ఆ సినిమా సెన్సేషన్ అయ్యింది. ఐతే పూజా హెగ్దే ఇప్పటివరకు ధనుష్ తో కలిసి నటించలేదు. పూజా హెగ్దే దాదాపు హీరోయిన్ గా కన్ ఫర్మ్ అనుకున్న టైం లో ఆమెకు షాక్ ఇస్తూ మరో భామని ఫైనల్ చేశారు. చూస్తుంటే కోలీవుడ్ లో కూడా పూజా హెగ్దేకి అన్ లక్ కొనసాగుతుందని అనిపిస్తుంది.
సౌత్ లో పూజా బేబ్ కి స్టార్ క్రేజ్..
బాలీవుడ్ లో కూడా పూజా హెగ్దే పెద్దగా బజ్ కొనసాగించట్లేదు. సినిమాలైతే చేస్తుంది కానీ ఆమె అక్కడ ట్రెండింగ్ లో మాత్రం ఉండలేకపోతుంది. సౌత్ లో పూజా బేబ్ కి స్టార్ క్రేజ్ ఉన్నా అందుకు తగినట్టుగా ఛాన్స్ లు మాత్రం రావట్లేదు. మరి పూజా హెగ్దే కెరీర్ లో టఫ్ టైం ఆమె ఇంకాస్త బలంగా నిలబడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.
తెలుగులో వరుసగా స్టార్ సినిమాలు చేస్తూ వచ్చిన పూజా హెగ్దే గుంటూరు కారం సినిమా నుంచి ఎగ్జిట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఛాన్స్ లు అందుకోవట్లేదు. ఐతే రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ తో నూతన దర్శకుడు రవి చేస్తున్న సినిమాలో అమ్మడు ఛాన్స్ పట్టేసింది. మరి ఈ సినిమాతో టాలీవుడ్ లో అమ్మడు కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.
