మినీ డ్రెస్ లో బుట్టబొమ్మ అందాలు!
ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి ఆఖరి చిత్రం 'జననాయగన్' చిత్రంలో నటిస్తోంది.
By: Madhu Reddy | 20 Jan 2026 4:14 PM IST2010లో మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్న పూజా హెగ్డే.. 2012లో వచ్చిన 'ముగమూడి' అనే తమిళ చిత్రం ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది. అటు తెలుగులో 2014లో నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' అనే సినిమాలో నటించి తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఏడాది ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి 'ముకుందా' అనే సినిమాలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమయంలోనే హిందీలో 2016లో హృతిక్ రోషన్ సరసన మోహెంజోదారో సినిమా ద్వారా హిందీ రంగ ప్రవేశం చేసింది.

ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి ఆఖరి చిత్రం 'జననాయగన్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది జనవరి 9వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ జాప్యం వల్ల విడుదల ఆలస్యం అవుతుంది. ఇంకా ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ వెలువడలేదు. మరొకవైపు ఈమెకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
పూజ హెగ్డే మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక స్టార్ హీరో నా క్యారవాన్ లోకి వచ్చి నాపై చేయి వేశాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అలా అని సైలెంట్ గా ఉండిపోలేదు. ఆ స్టార్ హీరో చెంప చెల్లుమనిపించాను. ఇక అదే సినిమాలో ఆ స్టార్ హీరో తో నాకు కొన్ని సన్నివేశాలు ఉన్నా.. డూపు పెట్టి సన్నివేశాలు కంప్లీట్ చేశాము .ఇక ఆ తర్వాత నుంచి అతడితో కలిసి నేను స్క్రీన్ షేర్ చేసుకోలేదు" అంటూ పూజా హెగ్డే తెలిపింది. అయితే ఇది ఆమె స్వయంగా తెలిపిందా లేక ఎవరైనా ఆమె ఐడి పై ఇలా కామెంట్లు చేశారా అన్న విషయంపై ఇంకా స్వస్థత రాలేదు.
మరొకవైపు ఇంస్టాగ్రామ్ ద్వారా పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మినీ డ్రెస్ ధరించి మెట్లపై స్టైలిష్ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. స్టన్నింగ్ లుక్ లో పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బుట్టబొమ్మ ఎప్పుడూ తన అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఫిట్నెస్ గురించి తాను తీసుకునే ఫుడ్ డైట్ గురించి చెప్పుకొచ్చింది. నేను ప్రతిరోజు పండ్లు తీసుకుంటాను. అలాగే రోటీ , సబ్జీ, చేపలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసింది ఏదైనా సరే నేను ఇష్టంగా తింటాను. ముఖ్యంగా నాకు పిజ్జా అంటే ఇష్టం. కానీ కాఫీ , సలాడ్ వంటివి ఇష్టం ఉండదు అంటూ పూజా హెగ్డే తెలిపింది.
