Begin typing your search above and press return to search.

బుట్ట బొమ్మ లైనప్.. లక్కు తగిలితే మాత్రం..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో గ్యాప్ తీసుకున్నా కూడా తమిళ, హిందీ భాషల్లో ఆఫర్లు అందుకుంటుంది.

By:  Ramesh Boddu   |   22 Dec 2025 12:04 PM IST
బుట్ట బొమ్మ లైనప్.. లక్కు తగిలితే మాత్రం..!
X

బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో గ్యాప్ తీసుకున్నా కూడా తమిళ, హిందీ భాషల్లో ఆఫర్లు అందుకుంటుంది. రాధే శ్యాం తర్వాత మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ముందు సైన్ చేసిన అమ్మడు ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి అమ్మడికి తెలుగులో అవకాశాలు లేవు. స్టార్ ఛాన్స్ లే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా పూజాని తీసుకోలేదు. ఐతే ఈ టైంలో పూజా హెగ్దేకి తమిళ పరిశ్రమ అండగా ఉంది. సూర్యతో రెట్రో చేసిన అమ్మడు అది రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మరో రెండు ఛాన్స్ లు ఇచ్చింది.

దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమాలో..

పూజా హెగ్దే తమిళ్ లో ప్రస్తుతం లారెన్స్ తో కాంచన 4, దళపతి విజయ్ తో జన నాయగన్ చేస్తుంది. ఈ రెండిటితో పాటు ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న సినిమాలో ఛాన్స్ పట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రవి నెలకుడితి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా బేబ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్.ఎల్.వి బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇదే కాకుండా బాలీవుడ్ లో హై జవాని తో ఇష్క్ హోనా హై సినిమా కూడా చేస్తుంది అమ్మడు. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉంది. బాలీవుడ్ లో స్టార్ రేంజ్ కోసం ట్రై చేసిన పూజా హెగ్దే అక్కడ వరుస సినిమాలు చేస్తున్నా పెద్దగా క్రేజ్ రాలేదు. తెలుగులో స్టార్ స్టేటస్ వచ్చినా సరైన టైం లో మళ్లీ ఇక్కడ అవకాశాలు లేకుండా అయ్యింది. ఐతే ప్రస్తుతం అమ్మడి చేతిలో 4 సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో కచ్చితంగా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది పూజా హెగ్దే.

పూజా హెగ్దే థై షోకి సెపరేట్ ఫ్యాన్స్..

పూజా హెగ్దే సినిమాలో ఉందంటే గ్లామర్ కి ఢోకా లేదన్నట్టే లెక్క. అమ్మడి థై షోకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. మొన్నటిదాకా సౌత్ లో తనకు ఉన్న పాపులారిటీతో సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో నెట్టుకొచ్చిన పూజా హెగ్దే ఇప్పుడు తన పూర్తి ఫోకస్ సినిమాలే అనేస్తుంది. దుల్కర్ సినిమాతో తెలుగులో సత్తా చాటాలని చూస్తున్న అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయన్నది చూడాలి.

పూజా హెగ్దే మాత్రం తనకు అవకాశాలు ఉన్నా లేకపోయినా కాన్ఫిడెన్స్ ని మాత్రం లూజ్ అవ్వట్లేదు. తెలుగులో టైర్ 2 హీరోలతో అయినా నటించేందుకు అమ్మడు రెడీ అనేస్తుంది. దుల్కర్ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది.