Begin typing your search above and press return to search.

కెరీర్ స్లో అయితే పెళ్లి రూమర్లేనా?

సినీ ఇండ‌స్ట్రీలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ తరచూ కనిపిస్తుంది. ఒక హీరోయిన్ కెరీర్ కొంత నెమ్మదించిన దశలోకి వెళ్లినప్పుడు, ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై ఊహాగానాలు ఒక్కసారిగా పెరుగుతాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Aug 2026 3:00 PM IST
కెరీర్ స్లో అయితే పెళ్లి రూమర్లేనా?
X

సినీ ఇండ‌స్ట్రీలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ తరచూ కనిపిస్తుంది. ఒక హీరోయిన్ కెరీర్ కొంత నెమ్మదించిన దశలోకి వెళ్లినప్పుడు, ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై ఊహాగానాలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన‌ వార్తలు వేగంగా స్ప్రెడ్ అవుతాయి. ప్రస్తుతం పూజా హెగ్డే చుట్టూ తిరుగుతున్న పెళ్లి ప్రచారం కూడా ఇదే చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఆమె అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఓకే చెప్పిందన్న వార్త‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.

అయితే దీన్ని కేవలం గాసిప్‌గా చూడలేం. హీరోయిన్ల విషయంలో కెరీర్, ఏజ్, ప‌ర్స‌న‌ల్ లైఫ్ అనే మూడు అంశాలను సమాజం రెగ్యుల‌ర్ గా ఒకే ఫ్రేమ్‌లో చూడటమే ఇలాంటి ప్రచారాలకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఒక హీరో వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొన్నా అతని తర్వాతి సినిమా గురించే డిస్క‌ష‌న్ ఎక్కువగా జరుగుతుంది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం కెరీర్ మందగిస్తే వెంటనే పెళ్లి, ఫ్యామిలీ లైఫ్, సినిమాలకు గుడ్‌బై వంటి ఊహాగానాలు మొదలవుతాయి.

పూజా హెగ్డే కెరీర్‌ను పరిశీలిస్తే, ఒక దశలో ఆమె టాలీవుడ్‌లో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్ల‌లో ఒకరు. వరుస స‌క్సెస్‌ల‌తో స్టార్ హీరోల సరసన నటించిన ఆమెకు తరువాత కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం వల్ల మార్కెట్ వేగం కొంత తగ్గిన మాట వాస్తవమే. అయితే ఫ్లాప్‌లు కెరీర్‌ను పూర్తిగా ముగించేస్తాయని చెప్పడం సరైంది కాదు. సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో పలువురు హీరోయిన్లు ఫ్లాపుల తర్వాత కూడా స్ట్రాంగ్ కంబ్యాక్‌లు చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కొత్త సినిమాలు ఉండటం, మళ్లీ సౌత్ మార్కెట్‌పై దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి రూమర్లు రావడం యాదృచ్ఛికమా? లేక కెరీర్ మార్పు దశలో ఉన్న హీరోయిన్ల‌పై సహజంగానే పెరిగే మీడియా, సోషల్ మీడియా ఆసక్తి ఫలితమా? అన్న ప్రశ్న ముందుకు వస్తోంది. మొత్తంగా చెప్పాలంటే, పూజా హెగ్డే పెళ్లిపై వస్తున్న వార్త‌ల‌ను అఫీషియ‌ల్ గా అనౌన్స్‌మెంట్‌ వ‌చ్చేవ‌ర‌కు వాటిని కేవ‌లం రూమ‌ర్లుగానే చూడాలి. హీరోయిన్ల కెరీర్‌లో నెమ్మదించిన ప్రతి దశను పెళ్లితో ముడిపెట్ట‌డం ఇప్పటికీ ఇండ‌స్ట్రీలో కొనసాగుతున్న సామాజిక మనస్తత్వానికి అద్దం పడుతోంది.