Begin typing your search above and press return to search.

పూజ కార్ వ్యాన్ కామెంట్స్.. అవన్నీ ఫేక్ పోస్టులా?

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే పోస్టులు కనిపిస్తున్నాయి. నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ హీరో ఎవరనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   20 Jan 2026 11:56 AM IST
పూజ కార్ వ్యాన్ కామెంట్స్.. అవన్నీ ఫేక్ పోస్టులా?
X

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాను చేసిన ఓ మూవీ షూటింగ్ టైమ్ లో తన కార్ వ్యాన్ లోకి పర్మిషన్ లేకుండా ఓ ప్రముఖ హీరో వచ్చారని చెప్పినట్లు కొన్ని గంటలుగా ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే పోస్టులు కనిపిస్తున్నాయి. నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ హీరో ఎవరనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఆ హీరో ఆయనేనని.. ఈయనేనని రకరకాల పేర్లు ఊహాగానాలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ విషయం ట్రెండింగ్ టాపిక్‌ గా మారింది. అయితే ఆ వార్తలపై ఇప్పుడు స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. అవన్నీ పూర్తిగా ఫేక్ న్యూస్ అని సమాచారం. అసలు పూజా హెగ్డే ఆ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కార్ వ్యాన్ లో ఓ హీరో వచ్చారనే విషయం గురించి ఆమె ఎక్కడా చెప్పలేదని, ఇంటర్వ్యూలలో గానీ, సోషల్ మీడియాలో గానీ అలాంటి కామెంట్స్ చేయలేదని సమాచారం. ఆ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వీడియో, ఆడియో లేదా అధికారిక ప్రూఫ్ కూడా బయటకు రాలేదు. అయినప్పటికీ, ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది ఆ వార్తలను వైరల్ చేయడం విమర్శలకు దారితీస్తోంది.

నిర్ధరణ లేకుండా ప్రచారం చేసిన కారణంగా.. పూజా హెగ్డే ఇమేజ్ కు భంగం కలిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల సినీ ప్రముఖుల పేరుతో ఇలాంటి ఫేక్ వార్తలు వైరల్ అవడం కామన్ అయిపోయింది. చిన్న మాటను వక్రీకరించడం, అసలు చెప్పని విషయాలను చెప్పినట్టుగా ప్రచారం చేయడం వల్ల అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి.

ఈసారి పూజ హెగ్డే పేరు వాడుకుని, ఊహాగానాలతో వార్తలు సృష్టించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పూజ హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అలా తన ప్రొఫెషనల్ కెరీర్‌ పై దృష్టి పెట్టిన సమయంలో.. ఇలాంటి అసత్య ప్రచారాలు రావడం బాధాకరమని ఆమె అభిమానులు అంటున్నారు.

ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా షేర్ చేయడం సరైన పద్ధతి కాదని పలువురు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకూడదని, అధికారిక సమాచారం వచ్చినప్పుడే నిజంగా భావించాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. మొత్తంగా పూజ హెగ్డే కార్ వ్యాన్ లోకి హీరో వచ్చారని చెప్పిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలినట్లే. అవన్నీ పూర్తిగా ఫేక్ న్యూస్ అని స్పష్టమవుతోంది.